Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘బుజ్జి ఐష్’.... భవిష్యత్... ఎలా?

' పాప పుట్టింది ' ...అంటూ తండ్రి అభిషేక్ ట్వీటర్ లో రాశాడు. గ్రాండ్ ఫాదర్ అయిన అమితాబ్ కూడా తన కుటుంబ కొత్త సభ్యురాలు బేబీ ఐశ్వర్యను ' క్యూటెస్ట్ బేబీ గాల్ ' అంటూ ట్వీట్ చేశాడు.
ఇక బేబీ ఐశ్వర్య కుండలి లేదా జాతకం గురించి చెప్పాలంటే....!
నవంబర్ 16 న పుట్టిన ఈ బేబీది వృశ్చిక రాశి.ఈ రాశి గల వారి గుణాలెలావుంటాయంటే.... ! పట్టుదల, ఆధిక్యత, శక్తి కలదిగా వుండడం...ఆమెకుగల శక్తితో, చుట్టూ వున్న ఇతరులను కూడా ప్రభావిస్తుంది. చాలా తెలివైనది, సహనం, సృజనాత్మకతలుంటాయి. అందరితో కలసి, మెలసి వుండటం, సామాజిక అభిప్రాయాలు, ఇతరులను సంతోష పెట్టేందుకు సిద్ధంగా వుండటం. వృశ్చిక రాశిలో పుట్టడం వలన ఆమెకు దండించే గుణం వుంటుంది. చుట్టు వున్నవారు ఆమెతో తప్పు చేయాలంటే జాగ్రత్తపడాలి. అన్ని అంశాలను సాధించగలదు. లోపల అమితమైన శక్తి. కష్టాలను ఎదుర్కొనగల సహనం. ఎంతో చురుకు, ఊహకు అందకపోవటం, ఒక్కొక్కపుడు మిస్టీరియస్ గా ప్రవర్తించటం వంటివి ఆమెవైపు అందరూ ఆకర్షించేలా చేస్తాయి.
బేబీ ఐశ్వర్య అదృష్ట సంఖ్య 7 -
ఈ సంఖ్యకు అధిపతి నెప్య్టూన్. అంటే... ఆమె భావనాశక్తి, ఆదర్శాలు కలది. సాధారణంగా ఈ సంఖ్య కలవారు అక్టోబర్ 21 మరియు నవంబర్ 20 ల మధ్య, ఫిబ్రవరి 19 మరియు మార్చి 20 ల మధ్య పుట్టిన వారితో అనుబంధం కలిగి వుంటారు. 1,3,4,5,7 మరియు 8 సంఖ్యలు కల వారితో కూడా అనుబంధం కలిగి వుంటారు. జీవితంలో బాహ్య ప్రపంచ విలువలకు ఆసక్తి ఎక్కువగా చూపరు.
నెలలోని 16వ తేదీన పుట్టిన విశేషం ఎలా వుంటుందంటే -
బేబీ ఏ వ్యవహారమైనా చాలా తేలికగా తీసుకుంటుంది. ఆనందంగా గడిపేస్తుంది. హాస్య చతురత, దయాశీలి, భావోద్రేకాలు, సున్నితత్వం కలిగివుంటుంది. ఎంతో నమ్రత. మానసికంగా మెళుకువ అధికం. మేధావి తరహాలో ప్రవర్తిస్తుంది. ఇతరుల అధికారానికి లోబడదు. ఊహాత్మకంగా వుంటుంది. ఉన్నతంగా ఆలోచిస్తూ విద్యాపర చర్చలు చేస్తుంది.



Click it and Unblock the Notifications