For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీకి పాలు అలర్జీ కలిగిస్తే...?

By B N Sharma
|

All About Milk Allergy In Babies
బేబీలలో పాల వలన కలిగే అలర్జీ సాధారణమే. బేబీకిగల వ్యాధి నిరోధక వ్యవస్ధ పాలలో వుండే ప్రొటీన్లకు రియాక్టు అయితే అలర్జీ ఏర్పడుతుంది. బిడ్డ చికాకు, కోపం కలిగి వుంటాడు. పొట్టలో గడబిడ, డయోరియా, చర్మం దద్దుర్లు, వాంతులు మొదలైనవి బేబీలో అలర్జీ వచ్చిందంటానికి చిహ్నాలు. చాలామంది పిల్లలు ఆవు పాలకు మొదట్లో అలర్జీ కలిగి వుంటారు. తల్లి ఆవు పాలు తాగితే కూడా బిడ్డకు అలర్జీ వస్తుంది.

తరచుగా కనపడే అలర్జీ లక్షణాలు ఎలావుంటాయంటే...
బిడ్డ బరువు పెరగడు
శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి
గ్యాస్ ఏర్పడుతుంది
వాంతులు
డయోరియా
చర్మం దద్దుర్లు
డీహైడ్రేషన్
ఆకలి మందగిస్తుంది
ముక్కు వెంబడి మ్యూకస్
ఎక్జిమా, ఆస్తమా మొదలైనవి

ఈ అలర్జీకి తీసుకోవలసిన తక్షణ వైద్యం.....

తల్లి ఆవుపాలు తాగుతుంటే....పాల ఉత్పత్తులను తీసుకోవడం ఆమె నిలిపి వేయటం మంచిది. బేబీకి అలర్జీ వున్నపుడు ఏ రకమైన పాలు తల్లి తీసుకోరాదు. వైద్యుడిని సంప్రదించి బేబీకి అవసరమైన ప్రత్యామ్నాయ కాల్షియం ఇతర పోషకాలకు సలహా పొందండి. సోయా లేదా ప్రొటీన్ ఆధారిత ఆహారాలు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి.

బేబీలలో వచ్చే పాల అలర్జీ వైద్యంతో త్వరగానే తగ్గించవచ్చు. సరైన వైద్యం కొరకు, ఈ సమయంలో బేబీకి ఇవ్వవలసిన ప్రత్యామ్నాయ ఆహారాలకు వైద్యుల సలహాలు పాటించండి.

English summary

All About Milk Allergy In Babies | బేబీకి పాలు అలర్జీ కలిగిస్తే...?

Milk allergy is a common problem among babies. The allergy occurs when the immune system reacts to the milk protein with antibodies. This leads to an allergic reaction thus making the infant fussy and irritable. An upset stomach, diarrhea, skin rashes and vomiting are few symptoms of milk allergy in baby. Most kids are allergic to cow's milk in the beginning. Mothers who drink cow milk during breastfeeding can also be a reason behind baby's skin allergy.
Story first published:Tuesday, September 27, 2011, 16:24 [IST]
Desktop Bottom Promotion