For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ బొటనవేలు చీకటం మంచిదే!

By B N Sharma
|

Baby Thumbsucking Is Good!
బేబీ బొటనవేలు నోటిలో పెట్టుకొని చీకటం మంచిదా ? కాదా ? అనేది తెలియకుండా చాలామంది తల్లులు ఆందోళన చెందుతుంటారు. పిల్లల విషయ నిపుణలు బేబీ బొటనవేలు చీకటం మంచిదే....అంటున్నారు. కారణం....బేబీ తన వేలు చీకుతూ ఆనందపడుతోంది అంతే...! ఆ వేలు నోటిలోనుంచి తీసేసి బేబీని ఏడిపించటమెందుకు? వేలు పాడైపోతుందని, మొండితనం చేస్తారని, గోళ్ళు వస్తే పోట్టలో క్రిములు చేరతాయని మమ్మీలు భావిస్తూంటారు. కాని ఇవన్నీ రుజువుకావడలేదు. ఆశ్చర్యపడే విషయమంటే...బేబీ తల్లి కడుపులో వుండగానే వేలు నోటిలో వేసుకుంటుందట. ! ఆకలి వేసినపుడు ఆహారం తినటం కూడా అపుడే ప్రాక్టీస్ చేస్తుంది.

వేలు చీకటం బేబీ మానసిక అవసరం తృప్తి పరుస్తుంది. వేలు చీకటంతో బేబీ నిశ్శబ్దంగాను, రిలాక్స్డ్ గాను వుండి నిద్ర కూడా పోతుంది. ఇక తల్లులు ఈ సమయంలో ఇంట్లో పనులు చక్కపెట్టుకోవచ్చు. వేలు చీకటమనేది సెరోటోనిన్ ను నియంత్రించి బేబేచే ఏడుపు ఆపేస్తుంది. మైండ్ మళ్ళించి బేబీ అభివృద్ధికి తోడ్పడుతుంది. మరో లాభం... పాలు తేలికగా తాగేందుకు సహకరిస్తుంది. తల్లితో అనుబంధం ఏర్పరుస్తుంది.

వేలు చీకటం మాన్పిస్తే, బేబీ ఏది కనపడితే దానిని నమిలేయటానికి ప్రయత్నిస్తుంది. దీనితో మరింత ఇన్ఫెక్షన్ కు గురవుతుంది. ఈ చర్య కంటే వేలు చీకుడే బెటర్ కదా! అందుకే వైద్యలు సైతం బేబీ మానసిక స్ధితిని మెరుగుపరచే ఈ చర్యను మంచిదే అంటున్నారు. కనుక తల్లులూ బేబీ చేసే ఇతర చర్యలకంటే కూడా ఇదే మెరుగని భావించండి.

English summary

Baby Thumbsucking Is Good! | బేబీ బొటనవేలు చీకటం మంచిదే!

Many mothers complain about their baby's thumbsucking habits without realizing whether the habit is good or bad. Thumbsucking, according to baby experts is surprisingly “good”, simply because the child enjoys doing it.
Story first published:Monday, September 26, 2011, 9:46 [IST]
Desktop Bottom Promotion