For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు రకాల ఆహారాలు బిడ్డకు ఇవ్వోద్దు!

By B N Sharma
|

Be careful about what you feed your Baby
మీ బిడ్డ ఘన ఆహారం తీసుకోవడం మొదలెట్టిందంటే సంతోషమే. అయితే సున్నితమైన వీరి పోట్టలను సంరక్షించేందుకు అదనపు జాగ్రత్తలు వహించాలి. వీలైనంత వరకు మీ పిల్లల డాక్టర్ ను సూచనలు కోరండి. ఆహారం వలన సాధారణంగా కొన్ని ఎలర్జీలు వచ్చే అవకాశం వుంది. బేబీని కొత్త ఆహారాలను చాలా నిదానంగా అలవాటు చేయండి. ఒకే సారి రెండు లేదా మూడు రకాల ఆహారం ఇవ్వవద్దు. ఏ ఆహారం తేడా చేస్తుందో తెలుసుకోడం కష్టమవుతుంది. ఒకే కొత్త ఆహారం రెండేసి రోజులు ఇచ్చితేడా చూడండి. నిపుణులు అలర్జీ కలిగించేవి 160 రకాల ఆహారాలున్నాయని చెపుతారు. సాధారణంగా పాలు, గుడ్లు, చేపలు, సోయా, బాదంపప్పులు, గోధుమలు మొదలైనవన్నీ బిడ్డకు కొత్తల్లో ఎలర్జీలు కలిగించేవే.

ఎలర్జీ, ఆహారం ఇచ్చిన రెండు గంటలలో బయటపడుతుంది. తేడా గమనించండి. చర్మంపై ఎర్రగా రాషెస్ రావచ్చు లేదా దగ్గు, తుమ్ములు, శ్వాస కష్టమవటం మొదలైనవి కావచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఆహారంలో మార్పులు చేయండి. డాక్టర్ ఇచ్చే సూచనలు పాటించండి. కొన్ని ఆహారాలు మొదటగా వికటించినా తర్వాత సరిపడుతాయి. చేపలు, గుడ్లు మొదలగు ఆహారాలకు బిడ్డకు పది నెలలు వచ్చే వరకు వేచి వుండండి.

కనీసం ఒక సంవత్సరం వచ్చే వరకు సంపూర్ణ ఆహారమైన ఆవు పాలను పట్టకండి. అందులో వుండే ప్రొటీన్లు బిడ్డ కడుపును ఉబ్బరించేలా చేస్తాయి. కొద్దిపాటి పెరుగు లేదా మజ్జిగ వంటివి వాడవచ్చు. తేనె ఆహారంగా ఇవ్వటానికి కనీసం రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగాల్సివస్తుంది.

English summary

Be careful about what you feed your baby | రెండు రకాల ఆహారాలు బిడ్డకు ఇవ్వోద్దు!

Experts say that there are more than 160 allergenic foods, but the most common culprits are milk, eggs, peanuts, walnuts, almonds, fish, soy and wheat.
Story first published:Saturday, August 13, 2011, 12:42 [IST]
Desktop Bottom Promotion