For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టిన నెలనుబట్టే కెరీర్ ఎంపిక!

By B N Sharma
|

Birth month influences your career choice
బేబీ పుట్టిన నెలను అనుసరించే భవిష్యత్తులో వారి వృత్తి ఎంపిక వుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. గత సెన్సస్ నుండి 19 రకాల వృత్తులు చేసే వ్యక్తుల పుట్టిన నెలలను నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయానికి చెందిన అధ్యయనకార్లు విశ్లేషణ చేసి ఈ విషయాన్ని కనుగొన్నట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక కనుగొంది.

బేబీలు పుట్టిన నెల వారి జీవితంలో ప్రధాన అంశాలలో ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, డిసెంబర్ లో పుట్టిన బేబీ ఒక డెంటిస్ట్ కావచ్చు. జనవరి నెలలో పుట్టిన బేబీ రుణాలు వసూలు చేసే డెట్ కలెక్టర్ కావచ్చు. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు ఒక కళాకారుడు కావచ్చునని, మార్చి నెలలో పుట్టిన వారు పైలట్లు కావచ్చునని అధ్యయనం తెలిపినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. వేసవి నెలలైన ఏప్రిల్, మే లలో పుట్టిన వారు క్రీడాకారులు, డాక్టర్లు లేదా డెంటిస్టులు అయ్యేటందుకు తక్కువ అవకాశాలున్నాయి.

ఈ పోకడలను వివరించటం కష్టం అయినా, పుట్టిన నెలలకు వారికి వచ్చే నిర్దేశిత ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధం వుంటుందంటారు. వసంతకాలంలో పుట్టిన బిడ్డలు స్కిజోఫ్రేనియా, అల్జీమర్స్, ఆస్తమా, మొదలగు వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా వున్నాయి. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైంటిస్ట్ రస్సెల్ ఫాస్టర్ మేరకు ఫలితాలు తక్కువ స్ధాయిలో వున్నప్పటికి అవి చాలా ఖచ్చితమని తాను వీటిని ఎస్ట్రాలజీ లేదా సీజనల్ ఫలితాలకు ముడిపెట్టటం లేదని వివరించారు.

English summary

Birth month influences your career choice | పుట్టిన నెలనుబట్టే కెరీర్ ఎంపిక!

Earlier this year, Russell Foster, Oxford University neuroscience, said the effects were small “but they are very, very clear”. “I am not giving voice to astrology - it’s nonsense - but we are not immune to seasonal interference,” he said.
Story first published:Tuesday, September 6, 2011, 10:26 [IST]
Desktop Bottom Promotion