For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవద్దు!

By B N Sharma
|

Breast Milk not advisable?!
పసిబిడ్డ తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమె బిడ్డకు పాలు ఇవ్వరాదు. డెలివరీ తర్వాత బ్లీడింగ్ అధికంగా అవుతున్నప్పుడు, జ్వరం లేదా ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకుండా తల్లి దూరంగా ఉండటమే మంచిదనివైద్యులు సలహానిస్తున్నారు.

ముఖ్యంగా డెలివరీ అయిన తరువాత కొన్నిరకాల మందులను తప్పనిసరిగా వాడతున్నప్పుడు.. అంటే, టీబీ, క్యాన్సర్, థైరాయిడ్ లాంటి వ్యాధుల నివారణకు మందులు వాడుతున్నప్పుడు.. వాటి ప్రభావం తల్లిపాల ద్వారా బిడ్డకు చేరే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటివారు పిల్లలకు పాలు ఇవ్వకుండా ఉండటమే మంచిదని ఆహార పోషక నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆరోగ్యంగా వున్న తల్లి తన పాలను పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా పుట్టినప్పటినుంచే తల్లిపాలను పిల్లలకు ఇవ్వటం ద్వారా, చిన్నతనంలో వచ్చే వివిధ రకాల వ్యాధుల బారినుంచి పసిబిడ్డలను రక్షించుకోవచ్చు. పిల్లల్లో యాంటీ అలర్జిటిక్ ఫ్యాక్టర్స్‌ను పెంపొందించే విశిష్ట గుణం తల్లిపాలలో మాత్రమే ఉంది. అందుకనే సాధ్యమైనంతవరకు బాటిల్ పాలజోలికి వెళ్లకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం శ్రేయస్కరంగా చెపుతున్నారు.

English summary

Breast Milk not advisable?! | తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవద్దు!

Breast milk can be given from a healthy mother. Breast milk protects the babies from getting different diseases of infants. Breast milk give anti allergic properties for the babies. That's why doctors advise to give breast milk only and do not go to bottle milk.
Story first published:Wednesday, September 21, 2011, 15:44 [IST]
Desktop Bottom Promotion