Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్తగా తల్లితండ్రులయ్యారా?

ప్రతిదానికి ఆందోళనపడటం:
బేబీ ఉమ్మినా, వాంతి చేసినా, లేదా ఏడ్చినా ఖంగారు పడకండి. దాని గురించే రోజంతా ఆలోచించకండి. మీ బేబీ పొట్ట మళ్ళీ సాధారణ స్ధితికి చేరుతుంది. బేబీ ఏది పెట్టినా నోటినుండి బయటకు తెప్పించడం లేదా అసాధారణంగా ఏడ్వడం చేస్తుందా? ఉన్న సమస్యలను పిల్లల వైద్యులకు చెప్పండి. భయాందోళనలు వీడండి.
అతిగా ఏడుస్తుందని ఆందోళనా?
ఏడ్చినా పరవాలేదు. ఏడ్పు మీరు తప్పు చేసినందువలన వచ్చిందని భావించకండి. సాధారణంగా పిల్లలు ఏడుస్తూనే వుంటారు. బేబీ అండర్వేర్ మార్చండి. కావలసిన ఆహారం ఇవ్వండి. అయినా మళ్ళీ బేబీ ఏడుస్తోందా? అతిగా ఖంగారుపడకండి. కొత్తగా పుట్టిన పిల్లలు ఏడుస్తూనే వుంటారు. అయితే, ఇక ఆపకుండా గంటకు పైగా ఏడ్చేస్తూంటే, వైద్యుడిని సంప్రదించండి.
పాలు పట్టాలని బిడ్డను లేపుతున్నారా?
అవసరం లేదు. బిడ్డకు పాలు కావాలంటే అదే లేచి ఏడుస్తుంది. బిడ్డ ఆకలితో వుందని భావించి అర్ధరాత్రి నిద్ర లేపకండి. తల్లిపాలు తాగే పిల్లలు రాత్రి పూర్తిగా నిద్రిస్తారు. వారంతట వారే నిద్ర లేస్తారు. బేబీ నిద్రను మీ అంతట మీరు పాలకోసమంటూ చెడగొట్టవద్దు.
బేబీ వాంతులు, ఉమ్మేయటాలు చేస్తోందా?
ఖంగారు పడకండి! బిడ్డలందరూ ఉమ్ము తెప్పిస్తూనే వుంటారు. ఆహారాన్ని పారేస్తున్నారని భావించద్దు. బేబీ కనుక ప్రతి అరగంటకు వాంతులు చేసుకుంటే, ఏదో తప్పు జరిగిందని అనుకోండి.
కారు షికారు:
పిల్లల్ని కారులో బయటకు తీసుకు వెళ్ళడం సంతోషమే. అయితే, బేబీని కూర్చో పెట్టిన కారు సీటు సురక్షితంగా వుందా లేదా అనేది పరిశీలించండి. తర్వాత పశ్చాత్తాప పడే కంటే ముందుగానే వారి భధ్రతలు చూడండి.
నోటి శుభ్రత :
పిల్లాడికి పళ్ళు రాలేదంటూ వారి నోరు శుభ్రం చేయటం అశ్రద్ధ చేయవద్దు. మెత్తటి గుడ్డ తీసుకొని సున్నితంగా బిడ్డ చిగుళ్ళు తుడవండి. పళ్ళు రావటం మొదలు పెడితే, బేబీకి ఇక బెడ్ లో నోటికి బాటిల్ ఇవ్వటం మానండి. దీని వలన వారు దానిని కొరకటం వుండదు. పిల్లల టూత్ బ్రష్ లు ఉపయోగించి వచ్చిన పళ్ళను శుభ్రపరచండి.
బిడ్డ గురించి జీవన భాగస్వామితో తగవులా ?
బిడ్డ పెంపకంలో ఇద్దరి భాగస్వామ్యం ఉంటుంది. ఇద్దరూ కలసి నిర్ణయం తీసుకుంటే మంచిదే. మీ భాగస్వా మి బిడ్డను అశ్రద్ధ చేస్తోందని భావించకండి. మీరిరువురూ భార్యా భర్తలే నన్న సంగతి గుర్తుంచుకొని బిడ్డను చక్కగా పెంచండి. మీరిరువురూ పోట్లాటలు పెట్టుకుంటే, నాలుగు నెలల బిడ్డకు కూడా ఖంగారు పుడుతుందన్న విషయం గుర్తుంచుకోండి.
ఇతరుల సలహాలు
తల్లిదండ్రులు బిడ్డను అలా పెంచాలి లేదా ఇలా పెంచాలి అంటూ అనేక మంది అనేక సలహాలను ఇస్తారు. వారి బిడ్డకు సరిపోయినది బీ బిడ్డకు సరిపడకపోవచ్చు. కనుక మీరే విచక్షణాయుతంగా మీ బిడ్డకు ఏ రకమైన పెంపకం సరిపోగలదో ఆలోచించి వారిని పెంచండి. బిడ్డ పెంపకంలోని అనుభూతులను పూర్తిగా ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications