For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిబిడ్డల పోషకాహారాల చిట్కాలు!

By B N Sharma
|

Healthy Diet Tips For Newborns
కొత్తగా పుట్టిన పిల్లలు ప్రత్యేకించి మూడు నెలలోపు వారు ఎంతో సున్నితంగా వుంటారు. వారికిచ్చే ఆహారం సింపుల్ గానే వుంటుంది. కాని అసలు ఏమివ్వాలనేది సమస్య. కనుక కొత్తగా జన్మనిచ్చిన తల్లలూ మేం ఇచ్చే చిట్కాలు ఆచరించి సమస్యకు దూరమవండి!

పసిబిడ్డలు రోజులో చాలా భాగం నిద్రపోతూనే వుంటారు. వారికి ఆకలి వేస్తే లేదా మూత్రం పోసి చల్లగా అయితే మేలుకుంటారు. తినేది చాలా తక్కువ కనుక వారి ఎదుగుదలకు దోహదం చేసే సరి అయిన ఆహారాన్ని అందించాల్సిన అవసరం వుంది. బేబీలకు కావలసిన ఆహారం రకాలు దిగువ ఇస్తున్నాము, పరిశీలించండి.

పసికందుల ప్రధాన ఆహారం తల్లిపాలు. పిల్లల వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు తల్లిపాలను బేబీలకు మంచి ఆహారంగా అంగీకరిస్తారు. తల్లిపాలలో యాంటీ బాడీలు, విటమిన్లు, పోషకాలు అనేకం వుండి బిడ్డ ఎదుగుదలకు దోహదం చేయటమే కాక బిడ్డ శరీరం వ్యధులనుండి సంరక్షించుకోడానికి కూడా తోడ్పడతాయి.

పసిబిడ్డలు ఆహారం సాధారణంగా ద్రవరూపంలోనే వుంటుంది ఇది పొట్టలో అధిక సమయం వుండదు. కనుక కొత్త మామ్ లు వారి పొట్టను బట్టి సక్రమమైన వేలలో ఈ ఆహారాన్ని అందిస్తూండాలి. బేబీకి ఆకలైతే దాని కదలికలు, ధ్వనులు తెలుపుతాయి. ఆకలి తీరకపోతే, ఏడుస్తుంది. అసహనంతో కదులుతుంది. పిల్లల వైద్యనిపుణులు ఒక ప్రణాళిక మేరకు పాలు పట్టేకంటే, బేబీకి ఆకలైనపుడు ఇవ్వమంటారు. పసిబిడ్డలు ఎదిగే కొలది వారి అవసరాలు మారుతూంటాయి. పసిబిడ్డలు మొదటి నెలలో సుమారుగా 6 నుండి 120 గ్రాముల ఆహారాన్ని తీసుకుంటూంటారు. రెండవ నెలలో 150 నుండి 180 గ్రాములు, తర్వాత 200 గ్రాముల వరకు తీసుకుంటారు.

తల్లిపాలతోపాటు ఇవ్వవలసిన ఇతర అవసరాలు:
పసిపిల్లలకవసరమైన విటమన్ డి మరియు ఇ ల కొరకు విలమిన్ ఆయిల్ తో మర్దన చేయటం లేదా వారిని ఉదయపు వేళ సూర్యరశ్మికి చూపటం చేయాల్సివుంటుంది.

పసిపిల్లలకు ఘన ఆహారం ఇవ్వకండి. అది అనవసరంగా వారి బరువు పెంచటం, లేదంటే జీర్ణక్రియ సమస్యలు, మొదలగువాటికి అవకాశం ఇస్తుంది. అవసరాన్నబట్టి బేబీకి ఆవుపాలు ఇవ్వటం కూడా మంచిదే.

English summary

Healthy Diet Tips For Newborns | పసిబిడ్డల పోషకాహారాల చిట్కాలు!

For vitamin D and E, massaging them with the vitamin oil and taking them to early morning sun will help. Avoid solid food for newborns as it may lead to unwanted weight gain, digestive problems etc. Also feeding with cow's milk can be healthy for the baby.
Story first published:Wednesday, August 24, 2011, 11:31 [IST]
Desktop Bottom Promotion