For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసికందుల ఆకస్మిక మరణాలు... ఆపటం సాధ్యమా?

By B N Sharma
|

How To Prevent Sudden Infant Death Syndrome?
ప్రసవానంతర దశ తల్లులకే కాదు బిడ్డలకు ప్రమాదకరమైనదే. నేటికి వైద్య, ఫోరెన్సిక్ నిపుణులకు పసికందుల ఆకస్మిక మరణాల కారణాలు అంతుపట్టనివే. ఈ ఆకస్మిక మరణాల కారణాలు, వాటి నివారణలు పరిశీలిద్దాం....

పసికందులు పురిటిలోనే చనిపోవటానికి 5 ప్రధాన కారణాలుంటాయి...
1. బిడ్డ పుట్టేటపుడు తక్కువ బరువు కలిగి వుండటం.
2. ఊపిరితిత్తులు రక్తస్రావం చేయటం
3. బిడ్డ నిద్రపోయే భంగిమలు
4. బిడ్డ పుట్టిన గది ఉష్ణగ్రతలు సరిగా లేకపోవటం
5. తల్లిపాలు పట్టకపోవటం

పసికందుల మరణాలు ఆపేదెలా?
1. బిడ్డ వున్న గదిలో సరైన గాలి, ఉష్ణోగ్రతలు వుండేలా చూడండి. బిడ్డ విశ్రమించాలంటే ఇది ప్రధానం. కనీసం ఒక ఫ్యాన్ వుంచినా చాలు బిడ్డ సౌకర్యం కొరకు అనేది గుర్తుంచుకోండి.

2. తలగడలు, మెత్తటి బొమ్మలు, కుషన్లు మొదలైనవి బిడ్డకు పక్కగా పెట్టవద్దు. బిడ్డ వున్న ప్రదేశం మంచి గాలి వెలుతురు వుండి ఇరుకుగా లేకుండా వుండాలి.

3. బిడ్డకు మెత్తగా వుండాలని ఊయలలో తలగడలు, కుషన్లు పెడతాం. వాటిని తీసేయండి. రీసెర్చి మేరకు బిడ్డ కార్బన్ డై ఆక్సైడ్ వాయివు పీలిస్తే ఆకస్మిక మరణం జరుగుతుంది.

4. ఆకస్మిక మరణం సంభవించకుండా వుండాలంటే బిడ్డకు విశ్రాంతినిచ్చే అతి తక్కువ తీవ్రత గల పేసిఫైయర్ ఇవ్వటం కూడా మంచిదే. ఇది బిడ్డ సౌకర్యంగా లేనపుడు పని చేస్తుంది.

5. తాజా పరిశోధనలలో తల్లిపాలు పడుతూ వుంటే శిశు మరణాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువని కూడా తేలింది.

English summary

How To Prevent Sudden Infant Death Syndrome? | పసికందుల ఆకస్మిక మరణాలు... ఆపటం సాధ్యమా?

Using pillows, stuffed toys, sleep positioners, bumper pads and too soft bedding are said to increase the risk of SIDS so dressing a child with comfortable clothes and keeping the sleeping place free and plain would prevent.
Story first published:Wednesday, October 12, 2011, 9:19 [IST]
Desktop Bottom Promotion