Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీ బొటన వేలు చీకుడు... ఆపటమెలా?

అసలు వీరు ఈ పని ఎందుకు చేస్తారు? బొటన వేలు చీకడం వలన వారిలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి వారి మైండ్ కు హాయి నిచ్చి నిద్రపట్టేలా చేస్తాయి. ఇదేమీ చెడుకాదు. కాని రోజంతా అదేపని చేస్తే అనేక సమస్యలు వస్తాయి. పంటి సమస్యలు, వేళ్ళు ఎదుగుదల మొదలైనవి. ఈ అలవాటు మాన్పించకపోతే అదే కొనసాగి వేలు చర్మం పలచపడుతుందని, గోళ్ళు ఎదగటంవలన వారు వాటిని కొరకటం వలన ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదముందని తల్లితండ్రులు భావిస్తారు.
బేబీ చేత బొటన వేలు చీకే అలవాటు మాన్పించే మార్గాలు -
1. బలవంతంగా మాన్పించటం పనిచేయదు. వేలు చీకినందుకు బేబీని తిట్టకండి లేదా వాడివైపు కోపంగా చూడకండి. అలా చేస్తే వాడు అదే పనిని మరింత అధికంగా చేస్తాడు. బేబీ వేలును కాపాడటానికిగాను వాడి నోటిలో ఒక పీక పెట్టండి. దానితోపాటు ఒక షుగర్ కేండీ వుంచండి. బేబీ గమనాన్ని బొమ్మలు, పజిల్స్, పాటలు మొదలైన మంచి అంశాలవైపు మరలించండి.
3. అతనికిష్టమైనదే ఎల్లపుడూ చేయండి-బేబీకి అడిగినదివ్వకుండా నిరాశపరచకండి. బేబీ ఒత్తిడి కారణంగా కూడా బొటనవేలు చేకుతుందని చెప్పచ్చు.
4. వేళ్ళకు సహజమైన వేపనూనె, లేదా ఆవనూనె లాంటివి రాయండి. ఇక వేలు చేదుగా వుండి మీ బిడ్డ అలవాటును వదిలేస్తుంది.
5. సంతోష పరచండి. బేబీ ఎపుడు ఒంటరిగా భావించినా, వాడికి ఏదో ఒక పని ఇవ్వండి. ఇక అతను ఆ పనిపై చురుకుగా వుంటాడు. అతను చేసిన పనిని బాగుందని మెచ్చుకోండి. దాంతో వాడు సంతోషపడి బొటనవేలు చీకటం మర్చిపోతాడు కూడాను.



Click it and Unblock the Notifications