For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ అవసరాలు.... తీర్చండిలా!

By B N Sharma
|

Is The Baby Diaper Better Or The Cloth Napkins
మీ బేబీకి డైపర్లు వాడాలా? లేక క్లాత్ నేప్ కిన్ వాడాలా అని సంశయంలో వున్నారా? సాధారణంగా చాలామంది తమ బడ్జెట్ బట్టి, బేబీ సౌకర్యాన్ని బట్టి రెండూ వాడుతూంటారు. అయితే, ఈ రెంటిలో ఏది మెరుగైనదనేది పరిశీలిద్దాం! కొత్తగా పుట్టిన బిడ్డలకు రోజుకు కనీసం పది డైపర్లన్నా కావాల్సిందే. బేబీ అవసరాలలో ఇవి ప్రధానంగా వుంటాయి.

క్లాత్ నేప్ కిన్స్ - కొంతమంది తల్లులు ఇంట్లోనే ఒక పెద్ద గుడ్డను డైపర్ల సైజులో కత్తిరించి బేబీకి వాడుతూంటారు. ఈ గుడ్డలను శుభ్రంగా ఉతికి, ఆరవేసి మరల బేబీకి వాడవచ్చు. ఎన్నిసార్లు వాడినా వ్యయం చాలా తక్కువ. గుడ్డ అనేది మెత్తగా వుంటుంది ఉపయోగించటం కూడా తేలిక. బేబీ కూడా తేలికగా భావిస్తుంది. ఆరోగ్య రీత్యా కూడా మంచిదే.

మెయింటెనెన్స్ - గుడ్డ నేప్ కిన్స్ ను వేడినీటిలో కొద్దిపాటి సోప్ ఉపయోగించి శుభ్రం చేయాలి. వీటిని డెట్టాల్ తో కూడా శుభ్రం చేసి ఎండలో ఆరవేయవచ్చు. వీటివలన ప్రయోజనమంటే, వ్యయం చాలా తక్కువ, ఉపయోగించటం తేలికగా వుంటుంది. వీటి నష్టాలంటే, ఇవి ఎక్కువ తడిని పీల్చలేవు. ప్రతి సారి మార్చాల్సిందే. ట్రావెలింగ్ లో వీటితో కష్టంగా వుంటుంది. తడిసిన గుడ్డను మార్చకపోతే, బేబీకి ర్యాషెస్ వచ్చే ప్రమాదం కూడా వుంది.

డైపర్లు నీటిని అధికంగా పీల్చుకుంటాయి. తీసుకు వెళ్ళటం తేలిక. ఎప్పటికపుడు పారవేయవచ్చు. వాసన కొట్టవు. డైపర్ నీటిని బాగా పీల్చుకుంటుంది కనుక తల్లి బేబీ డ్రస్ గురించి కూడా ఆందోళన చెందనవసరం లేదు. బేబీ చర్మం పొడిగా వుంటుంది. బేబీకి కావలసిన ఆరోగ్యం లభిస్తుంది. వీటికి మెయిన్టెనెన్స్ లేదు. పారవేయడమే. తీసుకు వెళ్ళడం తేలిక. నేప్ కిన్ కంటే ఎక్కువకాలమే వస్తుంది. నష్టం పరిశీలిస్తే, బేబీకి బరువుగా వుండి కొద్దిపాటి అసౌకర్యం వుంటుంది. ఖరీదు ఎక్కువే.

English summary

Is The Baby Diaper Better Or The Cloth Napkins | బేబీ అవసరాలు.... తీర్చండిలా!

Baby Diapers are the best as they can absorb more water, they are easy to carry and can be disposed after use. The diapers don't stink as they are made of clinically tested material. Since the diapers have a good absorbing capacity, mother's need not worry about the baby's dress.
Story first published:Saturday, October 1, 2011, 10:41 [IST]
Desktop Bottom Promotion