Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలు పట్టు, పాట పాడు..... తండ్రిగా గుర్తింపు పొందు....!

కొత్తగా తండ్రి అయిన పురుషుడు బేబీ పట్ల ఏ రకమైన శ్రద్ధ వహించాలనేది చూద్దాం!
1. పుట్టిన బిడ్డకు తల్లి తన పాలను పడుతూ మహా ఆనందం పొందుతుంది. పుట్టిన బిడ్డ తన చిన్న కళ్ళను తెరచి చూడటం ఆ తల్లికి మరింత సంతోషాన్నిస్తుంది. బిడ్డతో అనుబంధానికి ఇదే సరైన సమయం. మరి తండ్రులు ఏ అవకాశం తీసుకోవాలి ? కొత్తగా తండ్రులైన వారు బేబీతో అనుబంధానికై పాల బాటిల్ నోటికి అందిస్తూ అవకాశాన్ని తీసుకోవాలి. బేబీ తండ్రిని కూడా అదే సమయంలో కళ్ళు తెరచి చూస్తూనే వుంటుంది.
2. పుట్టిన పిల్లలు శారీరక మాసేజీని బాగా ఇష్టపడతారు. ప్రతి తల్లి లేదా తండ్రి తమ కొత్తగా పుట్టిన బిడ్డకు చక్కటి శారీరక ఎదుగుదలకు బాడీ మాసేజ్ చేయాలి. దీనికిగాను తండ్రులు ముందుకు వచ్చి సున్నితంగా బేబీ శరీరాన్ని మాసేజ్ చేస్తూ ఒక చక్కటి పాటతో ధ్వని వినిపిస్తే బేబీకి తండ్రితో అనుబంధం అప్పటినుండే ఏర్పడగలదు.
3. కొత్తగా పుట్టిన బిడ్డకు ధ్వని చేస్తే సమీపంలో తమపై శ్రద్ధ తీసుకునేటందుకు ఒకరున్నారన్న భావన కలుగుతుంది. వారివంక చూసినా, మాట్లాడినా ఆనందపడుతుంది. కనుక తండ్రులు బిడ్డతో అనుబంధం ఏర్పరచుకోవాలంటే, తమ పనులను రోజులో కనీసం కొంతసేపు పక్కన పెట్టి వారికి పాటలు పాడటం మంచిది.
4. బిడ్డను తీసుకొని వీపుపై వేసుకొని పాట పాడుతూ పార్కుల్లో తిరగండి. బేబీతో మాట్లాడండి. వారితో మాటలు పటిష్టమైన స్నేహాన్ని కలిగిస్తాయి. ఇక మమ్మీయే కాదు తన డైపర్లు మార్చటానికి డాడీ అనేవాడొకడున్నాడని బేబీ ఆనందపడుతుంది.



Click it and Unblock the Notifications