For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకువచ్చే కంటి వ్యాధులకు చిట్కాలు!

By B N Sharma
|

Tips To Deal With Baby Eye Infection
మీ బిడ్డ కంటికి వ్యాధి వచ్చిందని ఎలా తెలుసుకుంటారు? ఇది వినటానికి సిల్లీగా వున్నా చాలా ప్రాధాన్యత గలది. బిడ్డలు సాధారణంగా ఏడ్చేటపుడు చేతులు కంటిపై పెట్టుకొని ఏడుస్తారు. కనుక వారి కంటికి ఏదైనా వ్యాధి సోకి నొప్పితో ఏడుస్తున్నారో లేక మరెందుకైనా ఎడుస్తున్నారో అనేది మనకు అర్ధంకాదు. మీ బేబీకి కంటి ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. కన్ను బాగా నలిపినందువలన కూడా బేబీకి కంటి జబ్బులు వస్తూంటాయి. బేబీల కంటిపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే, కొత్త తల్లితండ్రులకు కొన్ని చిట్కాలు చూడండి.

1. బేబీ కంటికి పుసులు కట్టేస్తుంది - బేబీ కళ్ళు పుసులు కట్టేసి నీరు బయటకు వస్తూండటం మీరు గమనించండి. సాధారణంగా బేబీలో రోజులో కొద్ది గంటలు పడుకుంటే ఇటువంటిది జరుగుతుంది. మనంకూడా నిద్ర నుండి లేవగానే కళ్ళలో వుండే మలినాలు నీటితో కడిగేసుకుంటాం. ప్రతి కొద్ది గంటలకు బేబీ నిద్రపోయేలా బేబీ వయసు నిర్ధారించబడింది. పాపం పిల్లలు వారి కళ్ళను వారు శుభ్రం చేసుకోలేరు. కనుక మీరు ఒక మెత్తని గుడ్డతో అపుడపుడూ లేదా నిద్ర లేచినపుడు వెంటనే వారి కళ్ళను తుడవాలి.

2. కంటిలో అధికంగా నీరు రావటం - కంటిలో పుసి పట్టేయడం, నీరు అధికంగా వస్తూండటం మొదలైనవి బేబీ కళ్ళు ఇన్ ఫెక్షన్ కు గురయ్యాయంటానికి నిదర్శనం. కొన్ని సార్లు బేబీ నిద్రిస్తున్నపుడు కూడా కంటినుండి నీరు వస్తూంటుంది. ఈ పరిస్ధితిలో మీరు బేబీని పిల్లల వైద్యునివద్దకు తీసుకు వెళ్ళాలి. ఇన్ ఫెక్షన్ తీవ్రంగా వుంటే యాంటీబయోటిక్స్ వాడాలి. లేదంటే అరచేయి వేడి చేసి కంటిమీద పెడితే బేబీకి కొంత ఊరటగా కూడా వుంటుంది.

3. కొత్తగా పుట్టిన పిల్లల కళ్ళలో కొన్ని సందర్భాలలో ఎర్రని జీరలుంటాయి. కాని అది కంటి ఇన్ ఫెక్షన్ కాదు. ఇవి సాధారణంగా వుండే కళ్ళలోని రక్త నాళాలు. బేబీ బయటకు వచ్చేముందు ఒత్తిడి పొందటం వలన ఏర్పడేవే. ఒక నెలరోజులలో ఇవి పోయి కన్ను సాధారణ స్ధితికి చేరుతుంది. ఎర్ర జీరలు పోకుండా కొనసాగితే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.

4. కొంతమంది అపుడే పుట్టీన బేబీలకు కంటీనీరును అడ్డగిస్తూ కంటిలో పలుచని పొర ఏర్పడుతుంది. అది గట్టిపడిన మ్యూకస్ కావచ్చు. లేదా కంటిలో ఏదైనా మలినం కావచ్చు. కంటి నీరు అడ్డగించబడుతూ బొట్లుగా పడుతుంది. బేబీ పెరుగుతూంటే, ఈ పొర ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. కంటికి కొన్ని పరిశుభ్రతా చర్యలు చేపట్టాలి.

5. బేబీ కండ్లకలక - ఇంటిలోని వారికెవరికైనా లేదా బేబీ ఆడే పిల్లలకు ఎవరికైనా కండ్ల కలక వుంటే బేబీలకు చాలా త్వరగా సోకుతుంది. ఆందోళన చెందనవసరం లేదు. వ్యాధికి కారణం తెలుసుకొని సరైన మందులు వైద్యుని సలహాతో వాడితే కంటి కలక నయమైపోతుంది.

English summary

Tips To Deal With Baby Eye Infection | పిల్లలకువచ్చే కంటి వ్యాధులకు చిట్కాలు!

How will you know if your baby has an eye infection? It might seem like a very silly question but it isn't. Babies cry most of the time and they tend to put their hands in their eyes. So, it gets difficult to understand whether they have just been crying or their eyes are watering due to an baby eye infection.
Story first published:Monday, October 3, 2011, 12:29 [IST]
Desktop Bottom Promotion