For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీని నిద్రపుచ్చాలంటే 6 సులభమైన పద్ధతులు!

By B N Sharma
|

Top 6 Ways To Get Your Baby To Sleep
బిడ్డను నిద్రపుచ్చాలంటే అంత తేలికైన పనికాదు. బేబీని ఎలా నిద్రపుచ్చాలి అనే విషయాన్ని తల్లితండ్రులు, కాబోయే తల్లులు, తండ్రులు తెలుసుకోడానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం పరిశీలించండి. ఈ చిట్కాలు పసిబిడ్డలకు, కొద్దిపాటి పెద్ద పిల్లలకు కూడా ఉపయోగిస్తాయి.

1. నిద్రపోవటం, తినటం వంటివి పిల్లలపై బలవంతంగా ఆచరింపజేయలేము. అయితే తల్లితండ్రులు బిడ్డలు నిద్రపోయేటందుకు లేదా తినేటందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించి వారిని సౌకర్యవంతంగా వుంచితే వారు తేలికగా నిద్రిస్తారు.

2. కొన్నిసార్లు తల్లితండ్రులు కూడా పిల్లలతో కలసి నిద్రపోవాలి లేదా పోతున్నట్టు నటించాలి అపుడు బిడ్డలు కూడా నిద్రిస్తారు. ఈ అలవాట్లు పిల్లలలో చిన్నతనంలోనే కాదు పెద్దవారైన తర్వాత కూడా జీవితంలో కొనసాగుతూనే వుంటాయి.

3. మీ బేబీకి ఎపుడు ఏది ఇష్టమో గ్రహించండి. ఏ సమయంలో నిద్రిస్తుందో తెలుసుకోవాలి. ఈ విషయంలో ఎవరో చెప్పే విషయాలకంటే కూడా వ్యక్తిగతంగా అనుభవంపై తెలుసుకోవడం మంచిది.

4. బేబీ ఎక్కడ నిద్రించాలనేది ముందు నిర్ధారించండి. పిల్లలు నిద్రించాలంటే ఒక చోటంటూ వారికుండదు. కుటుంబ సభ్యులంతా ఎక్కడ నిద్రిస్తే బేబీని కూడా అక్కడ పడుకోబెట్టటం మంచిది. కొంతమంది బిడ్డలు వారి ఊయల ఇష్టపడతారు. కొంతమంది తల్లి పక్కన బెడ్ రూమ్ లో పడుకోటానికి ఇష్టపడతారు.

5. బేబీని వివిధ రకాలుగా, ఊయల, రాకర్ లేదా మ్యూజిక్ తో పడుకోబెట్టటం హాయినిస్తుంది.

6. బిడ్డ ప్రతిరోజూ చక్కగా నిద్రించాలంటే, కుటుంబ సభ్యులు కూడా సరియైన నిద్ర వేళలు ఆచరించాలి. ఇది బేబీ నిద్రా సమయాలను సౌకర్యవంతం చేయటమే కాక, బేబీ అసలు ఎప్పుడు పడుకుంటుందనేది తల్లికి కూడా తెలుస్తుంది.

English summary

Top 6 Ways To Get Your Baby To Sleep | బేబీని నిద్రపుచ్చాలంటే 6 సులభమైన పద్ధతులు!

Decide where baby sleeps best. There is no right or wrong place for babies to sleep. Wherever all family members sleep the best is the right arrangement for you and your baby. Some babies sleep best in their own crib in their own room, some sleep better in their own bassinet or crib in the parents' bedroom, other babies sleep best snuggled right next to mommy in the parents' bed.
Story first published:Wednesday, October 5, 2011, 10:52 [IST]
Desktop Bottom Promotion