Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
బిడ్డ బరువు, ఎత్తులు పెంచటానికి మార్గాలు!

బిడ్డ బరువు తక్కువగా వున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడు బిడ్డ శరీర బరువు, ఎత్తులను కొలుస్తాడు. వీటి ఆధారంగా బిడ్డ బరువు లోపించిన కారణాలు తెలుస్తాయి. ఒక్కొకపుడు, వంశానుగతంగాను లేదా పోషకాహార లేమితో కూడా బరువు తగ్గుతుంది. బిడ్డకు ఎక్కువ సమయాలలో కొద్ది కొద్దిగా ఆహారం ఇవ్వండి. ఒకే సారి అధికంగా ఇవ్వవద్దు. ప్రతి సారి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. బిడ్డకు రోజులో కనీసం 6 సార్లు ఆహారాన్ని ఇవ్వవచ్చు.
పిల్లలలో సాధారణంగా ఐరన్ తక్కువగా వుండి రక్తహీనతకు లోనవుతారు. కనుక వీరి ఆహారంలో ఐరన్ అధికంగా వున్న పదార్ధాలు ఇవ్వండి. కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్, లెంటిల్స్, సోయాబీన్స్, ధాన్యాలు, గింజలు, బ్రెడ్, అన్నం మొదలైనవి ఐరన్ అధికంగా వుండే పదార్ధాలు. బరువు పెరగటానికి కేలరీలు అధికంగా వుండే ఆహారమివ్వండి. అది తగినంత శక్తి కూడా ఇస్తుంది. బిడ్డ ఎత్తును ప్రోత్సహించే చర్యలు చేపట్టండి. బిడ్డ చురుకుగా లేకుంటే సోమరియై శరీర ఎదుగుదల సహకరించదు. బయటకు తీసుకువెళ్ళి బాగా ఆడించండి. ఆహారంలో కాల్షియం ఇస్తే అది ఎముకలను ధృఢతరం చేసి ఎత్తును పెంచుతుంది. పాల ఉత్పత్తులు కాల్షియం అధికంగా కలిగి వుంటాయి. మీ బిడ్డ పాలు ఇష్టపడకపోతే పెరుగు, వెన్న వంటివి పెట్టండి. జింక్ అధికంగా వుండే పదార్ధాలు బరువు పెంచటమే కాక ఎత్తును కూడా అధికం చేస్తాయి. చేపలు, మాంసం, పుచ్చకాయ విత్తనాలు, బఠాణీలు, డార్క్ చాక్లెట్ మొదలైనవి జింక్ అధికంగా వుండే ఆహార పదార్ధాలు.



Click it and Unblock the Notifications