Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఆరు నెలలు దాటిన తర్వాతే..... డైట్ ప్లాన్!

బేబీ ఎటువంటి సపోర్టు లేకుండా తనంతతాను కూర్చోగలగాలి. బేబీ తన మెడను సరిగ్గా నిలుపగలగాలి. పట్టేటటువంటి పాలను నోటినుండి బయటకు తెప్పించటం చేయరాదు. బేబీ చక్కని వెయట్ పొంది వుండాలి. ఆకలి కలిగి వుండాలి. నోరు బాగా కదిపి నమలటానికి ప్రయత్నిస్తుండాలి. పెద్దవారు తినేటపుడు ఆసక్తిగా చూడాలి. ఈ చిహ్నాలు కనపడితే ఇక బేబీ ఘన ఆహారానికి సిద్ధంగా వుందని భావించాలి.
ఘన ఆహారంగా ఏమి ఇవ్వాలి?
మొదటి నెల పూర్తిగా మెత్తగా చేసిన అన్నం లేదా రాగి జావ, లేదా ఇతర ధాన్యపు జావలు తర్వాత మెల్లగా కూరలు, పండ్లు, గుడ్లు మొదలగునవి అలవాటు చేయాలి. పిల్లలకు ఆహారం ఇచ్చేటపుడు ఎల్లపుడూ మీ చేతులు, వారి ఆహారపు గిన్నెలు పరిశుభ్రం చేస్తూ వుండండి.
పండ్లు లేదా కూరలు ఇచ్చేటపుడు వాటి తొక్కలు తీయడం అందులో వున్న గింజలు తీసివేసి గుజ్జులా చేయటం చేయాలి. వీరు తినే పదార్ధాలకు, ఉప్పు, షుగర్, తాలింపులు, తేనె, లేదా ఇతర తీపి పదార్ధాలు కలుపకండి. పిల్లలు సహజంగా పండ్లలోని తీపిని, కూరల లోని రుచిని ఇష్టపడతారు.
ఘన ఆహారం తినటం మొదలయ్యే సరికి పిల్లల మలం రంగు మారుతుంది,గట్టిపడి వాసన కూడా వస్తుంది. కొంతమంది బేబీలు ఘన ఆహారానికి త్వరగా అలవాటు పడరు. అయినప్పటికి ఇవ్వటం కొనసాగిస్తూ వుంటే వారికి అలవాటు అయిపోతుంది.



Click it and Unblock the Notifications
