For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిబిడ్డల కళ్లు రంగు ఎందుకు, ఎపుడు మారుతాయి?

By B N Sharma
|

When & Why Do Babies Eyes Change Color?
పుట్టినపుడు బేబీకి వుండే కళ్ళరంగు ఫైనల్ కాదు. పుట్టినపుడు హాస్పిటల్ లో నీలిరంగు కళ్ళతో కనపడిన బేబీతన ఒకటవ పుట్టిన రోజునాడు చూస్తే నల్ల కళ్లతో లేదా బ్రౌన్ రంగు కళ్ళతో కనపడుతుంది. మనం అపుడు పసిబిడ్డగా హాస్పిటల్ లో సరిగా చూడలేదులే అని సరిపెట్టుకుంటాం. బేబీ కళ్ళు రంగు అసలు ఎలా మారుతాయి? వయసుతోపాటు కాకపోయినప్పటికి బేబీ కళ్ళ రంగు తప్పక మారుతుంది.

పసిబిడ్డల కళ్ళు రంగు ఎపుడు మారతాయి?
చర్మంలానే కళ్ళలో వుండే మెలనిన్ పదార్ధ పరిమాణాన్ని బట్టి కళ్ళ రంగు మారుతుంది. లైట్ చర్మం కల బిడ్డలు వారి చర్మం వలెనే లైట్ కళ్ళను కలిగి వుంటారు. ఎందుకంటే వీరిలో మెలానిన్ తక్కువగా వుంటుంది. నల్లని చర్మం కల బేబీలు పుడుతూనే నల్లని కళ్ళను కలిగి వుంటే అవే కొనసాగుతాయి. అలాగే క్లియర్ బ్లూ లేదా గ్రీన్ లతో పుట్టిన బేబీలు సాధారణంగా అదే రంగులు జీవితాంతం కొనసాగిస్తారు. గ్రే, బ్రౌన్, లేదా డీప్ బ్లూ రంగులు తో పుట్టిన బేబీలు కలర్ మారతారు. కళ్ళలో వున్న పిగమెంటేషన్ బట్టి బేబీ కళ్ళ రంగు మారుతుంది. ఇది సాధారణంగా బేబీ మొదటి సంవత్సరంలోనే జరుగుతుంది అంటే మొదటి 9 నెలలలో కూడా కావచ్చు.

కళ్ళలో వున్న మెలనిన్ పదార్ధంపై సూర్యరశ్మి పడటం పై వుంటుంది. అధికంగా బేబీ కళ్ళలో సూర్యరశ్మి ప్రవహిస్తే కళ్లు నల్లగా వుంటాయి. ఒక భారతీయ బేబీ పుట్టటం లైట్ రంగు కళ్ళతో పుట్టినా తర్వాత అవి సూర్యరశ్మి అధికంగా పడటంచే నల్లగా మారే అవకాశం వుంది. కాని ఒక యూరోపియన్ బేబీ కళ్లు ఆ ప్రాంతాలలో సూర్యరశ్మి అధికంగా లేకపోవటం వలన నల్లగా మారే అవకాశం లేదు. పసిబిడ్డలు అధికంగా లైట్ కళ్ళతోనే పుడతారు. వారికి తర్వాత స్టీల్ గ్రే లేదా బ్రౌన్ కళ్ళు వస్తాయి. కళ్ళతో సమస్య వచ్చిపడిందని ఏ మాత్రం భయపడనవసరం లేదు.

బేబీలు కళ్ళ పోలికను తమ తల్లితండ్రులనుండి పొందుతారు. పుట్టినపుడు నీలంరంగు కళ్ళు వుంటే ఖంగారు పడకండి. తర్వాతి రోజుల్లో అవి తల్లితండ్రుల కళ్ళను సరిపోలుతాయి. లేదా మీ కుటుంబంలో ఎవరికైనా మరో రకం నీలి కళ్లు వుంటే అవి కూడా వచ్చే అవకాశం వుంది. కొత్తగా తల్లులు, తండ్రులు అయ్యేవారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

English summary

When & Why Do Babies Eyes Change Color? | పసిబిడ్డల కళ్లు రంగు ఎందుకు, ఎపుడు మారుతాయి?

The eye color of babies at birth is not their final eye color. You may have come across situations where you saw a baby in the hospital with deep blue eyes and on that baby's first birthday you see that the eyes have become black or brown. You probably brushed it off by thinking that there is a chink in your memory or it must have been an illusion. How can babies eyes change color?
Story first published:Friday, September 30, 2011, 8:35 [IST]
Desktop Bottom Promotion