Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
తింటే చాలు....ఎదుగుదల సూపర్!
తల్లికి ఎపుడూ బిడ్డ తినే ఆహారంపై అధిక శ్రద్ధ ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని కోరుతుంది. అందుకవసరమైన పోషకాహారాల కొరకు ఆమె ఎంతో శ్రమిస్తుంది. బిడ్డలు చిన్నతనంలో అతి త్వరగా వ్యాధులకు గురవుతారు. కనుక తల్లులు వారికి సరైన వయసులో సరైన ఆహారాలు తినిపిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడాలి.

తల్లి పాలు- ఒక శిశువు 4 నుండి 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తప్పించి వేరే ఆహారం తినరాదు. తల్లిపాలు బిడ్డకు ఎంతో ప్రధానం. తల్లిపాలలో విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్లు మరియు ప్రొటీన్లు వంటివి బేబీ శరీర ఎదుగుదలకు కావలసినవి ఎన్నో ఉంటాయి. బిడ్డ జీర్ణ వ్యవస్ధ బాగుండాలన్నా పేగులు శుభ్రం అవ్వాలన్నా తల్లిపాలు బిడ్డకు ఎంతో సహకరిస్తాయి. అవి బిడ్డలో రోగ నిరోధకతను పెంచుతాయి. వ్యాధులు కూడా రాకుండా చేసే అవకాశాలుంటాయి.
ఘనాహారం - ఆరు నెలల తర్వాత తల్లి బిడ్డకు ఘనాహారం ఇవ్వటం మొదలు పెట్టాలి. తన పాలు తక్కువ చేయాలి. ఘన ఆహారం అంటే, రాగి, బ్రౌన్ రైస్, పప్పు, పెసర పప్పు, మొదలైనవి ఉడికించి మెత్తగా చేసి తినిపించాలి. బిడ్డకు ఈ సమయంలో పొట్టు తీసిన పప్పులు పెట్టాలి. మాంసాహారులైతే, గుడ్డు సొన పెట్టటం మంచిది
కూరగాయలు - కూరలలో బిడ్డ శరీర ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఐరన్ వంటివి ఉంటాయి. కనుక పచ్చని ఆకు కరూరలు, చిలకడ దుంప, మొదలైనవి పెట్టవచ్చు. బిడ్డకు పది నెలలు వచ్చేటంతవరకు టమాటాలు, గోంగూర పెట్టకండి. కూరలు వండేముందు బాగా కడిగి, వండి, మెత్తటి గుజ్జుగా చేసి బిడ్డకు తినిపించాలి.
పండ్లు - బిడ్డకు విటమిన్లు మినరల్స్ తో బాటు సిట్రిక్ యాసిడ్ కూడా కావాలి. కనుక గుజ్జులా చేసిన అరటిపండ్లు, యాపిల్స్ బేబీకి మొదటి సారి పెట్టండి. బిడ్డకు ఈ పండ్లు అలవాటు పడితే, బొప్పాయి, రేగు, అవకాడో, ఆరెంజ్ వంటివి పెట్టవచ్చు. గుజ్జుగా చేసిన పండ్లకు కొంత తల్లిపాలు కూడా కలుపవచ్చు.
గింజ ధాన్యాల ఆహారం - బిడ్డకు మొదటి రెండు సంవత్సరాలు ఐరన్ అధికంగా ఉండే గింజ ధాన్యాలు ఆహారం పెట్టండి. రక్తహీనత లేకుండా ఐరన్ ఇవ్వాలి. మార్కెట్ లో బిడ్డల కొరకు తయారు చేసే ఘన ఆహారాలు బాగా పనిచేస్తాయి. వివిధ రుచులలో ఏ వయసు వారికి కావలసిన ఆహారాలైనా దొరుకుతాయి. నెజలే కంపెనీ వారి సెరిలాక్, లాక్టోజన్, నెస్టం వంటివి బేబీలకు ఘన ఆహారంగా బాగా పని చేస్తాయి.
క్రమేణా బేబీ ఎదుగుదల చూపి అధిక ఘన ఆహారం కోరుతుంది. దానితో ఘన ఆహారాలు ఒకటొకటిగా పెంచుతూ ఉండండి. ఏ కొత్త ఆహారం పెట్టినా దానిని బిడ్డ ఇముడ్చుకునేందుకు నాలుగు లేదా అయిదు దినాలు పడుతుంది. బేబీ జీర్ణ వ్యవస్ధ చాలా సున్నితంగా ఉంటుంది. కనుక ఏ ఆహారం పెట్టినా అది అతనికి సరిపడటానికి సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications