Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అపుడే పుట్టిన బేబీకి స్నానం?

భయం వుండటం సహజమే. కాని ధైర్యం కూడగట్టుకోండి. ఒకటి లేదా రెండు సార్లు బిడ్డకు స్నానం చేయిస్తే మీకే అలవాటు అవుతుందనే వాస్తవం గ్రహించండి. మీ బిడ్డకు మీ చేతులకంటే కూడా సురక్షితమైన స్ధానం లేదని నమ్మండి.
1. మొదటి ఒకటి లేదా రెండు వారాలు మీ బేబీని మెత్తటి గుడ్డను గోరువెచ్చటి నీటిలో ముంచి తుడిచేయండి. తర్వాత స్నానం చేయించటానికిగాను అపుడు మీకు కొంత శిక్షణ వస్తుంది.
2. బేబీ స్నానానికి ఎల్లపుడూ గోరువెచ్చటినీటినే ఉపయోగించండి. వేడినీరు క్రిములను చంపుతుంది. రెండోదిగా కొత్తగా పుట్టిన శశువుకు తన తల్లి ఒడి వెచ్చదనం వలే కూడా వుంటుంది.
3. రసాయనాలు తక్కువ వుండే సోప్ బేబీకి వాడండి. బేబీ చర్మం చాలా సున్నితంగా వుంటుంది. మీ బేబీని యాంటీసెప్టిక్ లోషన్లతో కూడా స్నానం చేయించవచ్చు.
4. బేబీకి ప్రతిరోజూ స్నానం అవసరం లేదు. వేసవిలో వారానికి 4 లేదా 5 సార్లు స్నానం చేయించండి. చలికాలంలో వారానికోసారి స్నానం చేయిస్తే చాలు.
5. బేబీ బొడ్డుతాడు స్నానం చేయిస్తే, నీటితడికి చెడిపోతుందనేది అపోహ మాత్రమే. అంతేకాదు, బొడ్డుతాడు కత్తిరింపుగాయాన్ని శుభ్రం చేసి బిడ్డ దానిని పీక కుండా కూడా చూడాలి.
6. శిశువుకు స్నానం చేయించేటపుడు, బిడ్డనను వెనుకననుండి మెడకింద, వీపుకింద చేయివేసి పట్టుకోండి బేబీలు తల సరిగా నిలుపలేరు. కనుక వారి తలకు కింద మెడ వద్ద మీ చేయి గట్టిగా వుండాలి.
7. బేబీని బాత్ టబ్ లోకి మెల్లగా దింపండి. బేబీలకు ప్రత్యేకంగా చిన్న టబ్ లు వుంటాయి. టబ్ లో కాళ్ళు ముందుగా వుంచండి. మెల్లగా బేబీ నీటిలో సౌకర్యవంతంగా కూర్చునేలా చూడండి. మెడవరకు బేబీని తడపండి. ఆపై వద్దు. మెడ పట్టుకునే వుండండి. రెండవ చేతితో శుభ్రం చేయండి. బేబీకి స్నానం ఎల్లపుడూ కూర్చునే చేయించండి. అది బిడ్డకు మీకు కూడా సౌకర్యం.
8. స్నానం అవగానే బిడ్డను మీ తొడపై కూర్చోపెట్టుకొని శుభ్రమైన టవల్ తో అద్దండి. బిడ్డకు స్నానం చేయించే ప్రదేశం కూడా శుభ్రంగాను వెచ్చగాను వుండాలి. ఇలావుంటే, బిడ్డ జలుబు వంటివి పొందకుండా వుంటుంది.
మీ శిశువు జాగ్రత్త పట్ల మీరే అధిక జాగ్రత్తలు తీసుకోగలరు. కనుక బేబీని స్నానం చేయించటానికి భయపడకండి. ఒకటి లేదా రెండు సార్లు చేయిస్తే అలవాటైపోతుందని అనుకోండి.



Click it and Unblock the Notifications