Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బేబీకి పాల బాటిల్ ఎలా ఎంపిక చేయాలి?

1. బాటిల్ లో ఎన్నిపాలు అవసరమనేది నిర్ధారించుకోండి. సాధారణంగా బాటిల్స్ రెండు సైజులలో వస్తాయి. 120 మి.లీ. మరియు 225 మి.లీ.గా వుంటాయి. ముందుగా చిన్న సైజు బాటిల్స్ రెండు కొనండి. పిల్లవాడు పెద్ద అయిన తర్వాత అవసరమనుకుంటే పెద్ద సైజు బాటిల్ కొనవచ్చు.
2. మీకు మీ బేబీకి కోరుకున్న బాటిల్ దొరికే వరకు సాధారణమైనవి ముందుగా రెండు బాటిల్స్ కొనండి.
3. బాటిల్ ని తల్లిపాలకు లేదా ఇతర పాలకు దేనికి ఉపయోగించినప్పటికి మీకు స్టెరిలైజర్, మరియు బాటిల్ శుభ్రపరచే బ్రష్ ఒకటి అవసరముంటాయి. తల్లిపాలు బాటిల్ లో పోయాలనుకుంటే ఒక బ్రెస్ట్ పంప్ కూడా అవసరం.
4. పీకలు లేటెక్స్ మెటీరియల్ తో చేసిందైతే, త్వరగా పగిలిపోతుంది. సిలికోన్ మెటీరియల్ తయారీ అయితే అధిక కాలం వస్తుంది. చాలామంది పీక, చనుమొన ఆకారంలో వుండాలని కోరతారు.
5. పాలు పీకనుండి కొత్తగా పుట్టిన బిడ్డలకు సాధారణంగా నిదానంగా రావాలి. చాలామంది తయారీదారులు పీకలకు నెంబర్లు వేస్తారు. నెం.1 అంటే నిదానంగా వచ్చేదని అర్ధం.
6. స్టెరిలైజ్ చేసిన పారవేయదగిన పీకలు మీరు బయట తిరిగేటపుడు బాగా ఉపయోగపడతాయి. మీ బేబీ కనుక నొప్పితో ఏడుస్తుంటే గాలి చొరని పీకలను పాలు తాగించేందుకు వాడండి.
ప్లాస్టిక్ బాటిళ్ళకంటే గాజుతో తయారు చేసిన బాటిల్స్ ఎప్పటికి మంచివే. అయితే నేటిరోజులలో పాలీప్రాపలీన్ మెటీరియల్ తో వచ్చే సీసాలు సురక్షితంగానేవుంటున్నాయి. పాలను బాటిల్ లో ఎప్పుడు పోసినా ముందుగా బాటిల్ ప్రతిసారి కడగాలి. బయట వున్నపుడు పాలు వేడినీరు రెండూ విడివిడిగా తీసుకెళ్ళి అవసరమయినపుడు మాత్రమే కలపాలి. బేబీకి కనుక వేడి పాలు ఇష్టమయ్యేటట్లయితే, వేడినీటిలో బాటిల్ వేడి చేసి ఇవ్వవచ్చు. లేదా 4 నుండి ఆరు నిమిషాలలో బాటిల్ వేడిచేయగల పాత్రలు రెడీగాదొరుకుతాయి. పాలు వేడిచేయటానికి మైక్రోవేవ్ ఉపయోగించకండి. పాలు సమానంగా వేడి ఎక్కకపోగా బిడ్డ నోరు కాలే ప్రమాదం కూడా వుంది.



Click it and Unblock the Notifications