Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనురాగంతో ఏర్పడే బిడ్డల అనుబంధం!

ఈ రకమైన బిడ్డల, తల్లితండ్రుల అనుబంధంపై ఇంకా సైంటిస్టులు రీసెర్చి చేస్తూనే వున్నారు. తల్లితండ్రులకు, వారి బిడ్డకు మధ్య ఏర్పడే అనుబంధం బేబీకి మొదటి అనుభవమని, సంబంధాలలో సన్నిహితం పొందటానికి భధ్రత, తగిన ఆత్మ విశ్వాసం బేబీ పొందటానికి ఇవి తోడ్పడతాయని వారు వెల్లడించారు. బిడ్డ ఇచ్చే సూచనలకు తల్లితండ్రుల స్పందన బిడ్డయొక్క సామాజిక మరియు తన స్వంత అభివృద్ధికి తోడ్పడుతుంది.
బేబీకి ఈ రకమైన బంధం అవసరమా? బేబీకి బంధం అవసరమే. స్టడీ మేరకు కొత్తగా పుట్టిన కోతిపిల్లలకు తల్లి ఒడి, ఒక బొమ్మ ఒడి చూపి వాటిలో పెంచారట. అయితే, తల్లుల అనుబంధంతో పెరిగిన కోతులు మిగిలిన కోతులతో కలసి మెలసి ఆటలు సాగించాయని, అయితే, బొమ్మ తల్లుల సంరక్షణలో పెంచబడిన కోతులు నిరాశా నిస్పృహలకు లోనయ్యాయని ఇతర కోతిపిల్లలతో కలువలేకపోయాయని సైంటిస్టులు గుర్తించారు. కనుక మానవుల పిల్లలలో కూడా తల్లి బిడ్డల అనుబంధం లోపిస్తే, బిడ్డలు సమాజంలో ప్రవర్తనా సమస్యలకు గురవుతారని సైంటిస్టులు చెపుతున్నారు.
పిల్లలు పుట్టిన వెంటనే అనుబంధానికి సిద్ధంగా వుంటారు. అయితే తల్లి తండ్రులు మాత్రం వివిధ రకాల భావనలు కలిగి వుంటారు. బేబీ పుట్టిన వెంటనే కొంతమంది తల్లితండ్రులు మొదటి నిమిషంలో లేదా మొదటి రోజే అనుబంధం ఏర్పరచుకోగా, మరి కొందరు, ప్రత్యేకించి దత్తతలు తీసుకున్నవారు లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పిల్లలు పెంచబడినవారికి తల్లితండ్రులతో అనుబంధం ఏర్పడటానికి సమయం పడుతుంది.
కాని అనుబంధం అనేది ఒక ప్రక్రియ అని అది నిమిషాలలో ఏర్పడేది, ఒక సమయంలో ఏర్పడేది కాదని పుట్టిన తర్వాత కొంత సమయానికి కొన్ని చర్యల కారణంగా కూడా ఏర్పడుతుందని వీరు తెలుపుతున్నారు. ఆ అనుబంధం ఏర్పడుతోందని మీకు తెలియనుకూడా తెలియదని అది మీ బేబీ మొదటి చిరునవ్వునుండి మీలో స్పందన కలిగి అకస్మాత్ గా ఒక్కసారి మీరు ప్రేమ ఆనందాలతో నిండినట్లు గ్రహిస్తారని రీసెర్చర్లు తెలుపుతారు.



Click it and Unblock the Notifications