Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బేబీ పాల సీసా ఎంత శుభ్రం?

బేబీ పాల సీసా శుభ్రతలు
స్టెరిలైజ్ - బాటిల్ ను వేడినీటిలో బాగా మరగనివ్వండి. బాటిల్ కొన్న వెంటనే దానిని ఇంటివద్ద శుభ్రంగా స్టెరిలైజ్ చేయండి. లేదా వేడినీటి ధార కింద కొద్ది నిమిషాలు కడగండి. బాటిల్ కు వుండే పీకను కూడా శుభ్రంగా వేడినీటిలో ఉడకపెట్టండి. క్రిములు నశిస్తాయి.
పాలు నిలువ - బేబీకి బాటిల్ పాలు పట్టేటపుడు చివరకు కొన్నిపాలు దానిలో మిగిలిపోతాయి. పూర్తిగా తాగలేదు. వాస్తవానికి బాటిల్ పాలకంటే కూడా బేబీ తల్లి స్తనం నుండి పాలు బాగా తాగుతుంది. బాటిల్ లో పాలు చివరలో వదిలేస్తే బేబీని తాగమని బలవంతపెట్టకండి. ఆ మిగిలిన పాలను పారపోయండి. వాటిని నిలువ వుంచితే, బాక్టీరియా పెరిగి వాసన వస్తుంది.
బాటిల్ పొడిగా - బాటిల్ ఎల్లపుడూ పాలు పోసే ముందు పొడిగా వుండేలా చూడండి. మొదటగా బాటిల్ వేడినీటిలోను, తర్వాత చల్లని నీటితోను కడగాలి. వెంటనే శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. బాటిల్ తడిగా వుంచి మూత పెడితే, వాసన వస్తుంది.
బాటిల్ పీక బాగా రుద్దండి - బేబీ బాటిల్ ప్రతిసారి కడగకపోయినా పీకను మాత్రం ప్రతిరోజూ వేడినీటిలో స్టెరిలైజ్ చేయాలి. బాటిల్ లోపలి మూలలు, మూత, పీక శుభ్రంగా కడగాలి.
బేబీ పాలసీసా ఎల్లపుడూ శుభ్రంగా కడిగి సరైన ప్లేస్ లో వుంచాలి. బేబీ దానిని నేలమీద పడవేసినా దాని పీక, బాటిల్ మరోమారు శుభ్రం చేయటానికి బద్ధకించకండి.



Click it and Unblock the Notifications