Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
పుట్టుమచ్చల పుటక ఎపుడు?

ఈ పుట్టు మచ్చలవంటివి చర్మంతో సమానంగా ఫ్లాట్ గా వుండవచ్చు లేదా కొద్దిగా పైకి లేచి కూడా ఉండవచ్చు. ఈ మచ్చలు కొన్ని వివిధ ఆకారాలలో, రంగులలో కూడా ఉంటాయి. బ్రౌన్, ట్యాన్, నలుపు, పేల్ బ్లూ, పింక్, రెడ్ లేదా ఊదారంగా వంటి వాటిలో ఉంటాయి. సాధారణంగా ఎరుపు లేదా నలుపుగా ఉంటాయి. వీటినే పుట్టు మచ్చలని కూడా అంటారు. ఆ రకమైన పుట్టు మచ్చలు బిడ్డకు హాని కలిగించవు. కొన్ని వాటంతట అవే పోతాయి. లేదా కొంతకాలం అయ్యే సరికి ముడుచుకుపోతాయి. కనుక మీ బిడ్డ మచ్చల విషయంలో ఏవేని సమస్యలు ఉంటే మీరు డాక్టర్ తో సంప్రదించండి.
ఈ పుట్టు మచ్చలకు కారణాలేమిటి?
ఈ మచ్చలను అరికట్టలేము. గర్భధారణ సమయంలో ఏదైనా ఆమె చేస్తే వచ్చేవి కావు. ఈ మచ్చలగురించి ఎవరూ తెలుపలేరు. అవి జన్యువులనుండి కూడా రావచ్చు. బిడ్డ పుట్టే సమయంలో కలిగే గాయాలవలన కూడా ఏర్పడవు. ఈ పుట్టు మచ్చలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రక్తనాళాలు సరిగా ఏర్పడకుంటే వచ్చేవి రెండవది కణాలు అధికంగా పెరిగితే వచ్చేవి.
కొన్ని పుట్టు మచ్చలు బిడ్డకు 1 లేదా 2 సంవత్సరాలు వచ్చే సరికి పోతాయి. మరి కొన్ని పెద్దవారైనప్పటికి ఉంటాయి. ఇంకా కొన్ని మచ్చలు జీవితాంతం కొనసాగుతాయి.
కొన్ని పుట్టు మచ్చలు జీవితంలోని వివిధ దశలలో కూడా వస్తాయి. కొంతమందికి పెద్దవారైనప్పటికి పుట్టు మచ్చలు పుట్టుకొస్తూనే వుంటాయి. కొన్ని పుట్టు మచ్చలకు పైన వెంట్రుకలు కూడా ఉంటాయి. వీటిని గురించి ఆందోళన చెందనవసరం లేదు. పుట్టు మచ్చలు కొన్ని మనిషి రూపానికి అలంకారంగా కూడా ఉంటాయి. ప్రత్యేకించి ఆడవారికి ముఖంపై వివిధ ప్రదేశాలలో ఉండే పుట్టు మచ్చలు వారి అందాన్ని పెంచుతాయి. కొన్ని సందర్భాలలో పిల్లలను పుట్టుమచ్చల కారణంగా కూడా పెద్దవారైన తర్వాత గుర్తుపట్టే అవకాశాలుంటాయి. మనిషి జీవితంలో వీటికి ఏ రకమైన ప్రాధాన్యతలు లేనప్పటికి వీటిని వారికి అదృష్టం తెచ్చిపెట్టేవిగా కూడా కొంతమంది భావిస్తారు. మనిషికి శరీరంపై వివిధ ప్రదేశాలలో ఉన్న పుట్టు మచ్చల ఆధారంగా పుట్టు మచ్చల శాస్త్రం కూడా ఏర్పడింది. అయితే, పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే, ఏ రకమైన ప్రయోజనాల్ని తెచ్చిపెడతాయనేది ఎవరికి వారే స్వంత అనుభవంతో తెలుసుకోవలసి వుంది.



Click it and Unblock the Notifications