Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
బేబీ షవర్ పార్టీ కేక్ మరియు ఆహారాల ఎంపిక ఎలా?

బేబీ షవర్ పార్టీ లో అన్నిటికంటే ప్రధానమైనది అందరిని ఆకర్షించేది బేబీ షవర్ కేక్. బేబీ షవర్ కేక్ అన్ని కేకుల మాదిరి ఉండరాదు. అది ఒక ప్రత్యేకత కలిగినదిగా ఆకర్షణీయంగా వుండాలి. స్ధానికంగా వున్న బేకరీలలో ముందుగా ఆర్డర్ పెడితే, ఈ కేకును తయారు చేస్తారు. ఆ సమయానికి వారు ఇంటికి డెలివరీ కూడా ఇస్తారు. అయితే, మనకు కావలసిన విధంగా ఇంటిలోనే దానిని తయారు చేసుకోవచ్చు కూడాను. అలా మనంతట మనమే చేసుకుంటే, కేక్ ను మరింత ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. మనం కోరుకునే రీతిలో దానిని చూపవచ్చు.
తగిన సమయం వున్నపుడు బయట ఆర్డర్ పెట్టటం కూడా మంచిదే. కేక్ తయారు చేసేవారితో మీ బేబీ షవర్ పార్టీ కేక్ ఎలా వుండాలని మీరనుకుంటున్నారో చర్చించండి. లేదా మీకు కనుక దానిని తయారు చేసే నైపుణ్యత వుంటే, కొన్ని వంటల పుస్తకాలు పరిశీలించి, ఆకేకును మీరే తయారు చేయవచ్చు. అందుకవసరమన డిజైన్ కొరకు మీ స్నేహితుల సహాయం తీసుకోండి. ఇంటిలో తయారు చేసుకుంటే ఖర్చు కూడా తక్కువగా వుంటుంది.
బేబీ షవర్ కేక్ తయారు చేయటానికిగాను, ఆన్ లైన్ లో వస్తున్న వంటకాలను, డిజైన్లను కూడా పరిశీలించండి. మీ కిష్టమైన రుచితో షవర్ కేక్ తయారు చేయండి. సాధారణంగా బేబీ షవర్ కేకుల ఆకారాలు, డిజైన్లు, పిల్లల వస్తువులకు సంబంధించిన, పూవులు, పక్షులు, సీతాకోక చిలుకలు, బేబీల ఆకారం, బొమ్మలు, ఇతర పిల్లల వస్తువులుగా వుంటాయి. ఇక రంగుల విషయానికి వస్తే, పసుపు, పింక్, బ్లూ, ఆకుపచ్చ, తెలుపు రంగులలో ఈ కేకులు తయారు చేయవచ్చు.
అంతేకాకుండా, మీరు బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీ షవర్ ఏర్పాటు చేసినట్లయితే, బేబీ ఫొటో ఒకటి తయారీ దారుకిచ్చి ఆ బొమ్మ తీరులో కేకు డిజైన్ తయారు చేయమని కూడా తెలుపండి. బేబీ షవర్ కేక్ తయారు చేయటంలో మరో ఐడియాగా, డైపర్లు ఉపయోగించండి. ఈ కేక్ వచ్చిన అతిధులకు కాదు. బిడ్డ తల్లి బాగా ఆనందిస్తుంది. డైపర్ కేక్ తయారు చేయాలంటే, డైపర్లను మూడు వరుసలుగా వేయాలి. దీనికి లేసులు, రిబ్బన్లు కూడా పెట్టండి. డైపర్లు బిగువుగా కేక్ కు కట్టరాదు. అది కేకును పాడు చేస్తుంది. టేబుల్ పై సెంటర్ పీస్ గా డైపర్ కేక్ పెట్టవచ్చు.
పార్టీలో ఆకర్షనీయమైన సెంటర్ పీస్ గా కేక్ పెట్టిన తర్వాత, మీరు మంచి బేబీ షవర్ ఆహారం కూడా ఏర్పరచాలి. చాలాసార్లు అందుకుగాను స్నాక్స్, టీ, డిజర్ట్స్ , కరకరలవంటివి ఇస్తాము. కనుక వెరైటీగా వుండాలంటే, గ్రిల్ ఆమారాలు బార్బెక్యూ వంటివి పార్టీకి వచ్చిన పురుష అతిధులకు ఇవ్వండి. అవి తింటూ డ్యాడీలందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కుటుంబంలోకి రాబోయే అతిధి గురించి మాట్లాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications
