Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
మీ బేబీ రాత్రుళ్ళు సరిగా నిద్రించటం లేదా?

బేబీ రాత్రులందు తేలికగా నిద్రించే చిట్కాలు -
ఆహారం బాగా ఇవ్వండి - పొట్ట నిండుగా వుంటే బేబీ బాగా నిద్రిస్తుంది. కనుక బేబీ పడుకునేముందర ఆమె పొట్టనిండా ఆహారం ఉండేలా చూడండి. తల్లిపాలు తాగే పిల్లలైతే, పాలు బాగా పూర్తిగా తాగేలా చూడండి. పగటిపూట ఎక్కడ కూర్చుని పాలు పట్టినప్పటికి రాత్రులందు శబ్దాలు రాని, చీకటి ప్రదేశంలో పడుకోపెట్టి పాలు పట్టేయండి. బేబీ వెంటనే నిద్ర పోతుంది.
చిన్నపాటి పగటి నిద్ర - బేబీ రాత్రులందు అధికంగా నిద్రించాలంటే పగటిపూట పోయే నిద్ర తక్కువ చేయండి. పగటి పూట మీ ఇంటిపని మధ్యలోనే బేబీకి కొద్దిగా నిద్ర పోయేలా చేసి పాలుపడుతూ వుండండి.
బేబీ పక్కనే - బేబీకి తల్లి పక్కలో పడుకుంటే భధ్రతా భావం వుంటుంది. కనుక బేబీని రాత్రులందు మీ పక్కలోనే పడుకోపెట్టుకోండి. బిడ్డ తల్లి గుండె చప్పుడు వింటూ బాగా నిద్రిస్తుంది. బేబీ నిద్రించినప్పటికి పది లేదా పదిహేను నిమిషాలపాటు మీరు బేబీ పక్కలోనే పడుకుని ఆమెకు మంచి నిద్ర కలిగించండి.
రొటీన్ ఆచరించండి - బేబీ రాత్రులందు బాగా నిద్రించాలంటే మీరు ఆమెకు ఒక రొటీన్ ఆచరించాలి. పాలు పట్టే సమయం, నిద్రించే సమయం నిర్దిష్టంగా వుండాలి.
బెడ్ సౌకర్యం - బేబీ నిద్రించే ప్రదేశం లేదా స్ధలం శబ్దాలు లేనిదై వుండాలి. పడక మెత్తగా వుండాలి. బేబీకి వేరు దుప్పటి కప్పండి. మీరు వేరుగా దుప్పటి కప్పుకోండి. మీరు మీ బెడ్ షీటు లాగితే బేబీకి నిద్రాభంగం అవుతుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే బేబీ రాత్రులందు బాగా నిద్రిస్తుంది. సాయంకాలంనుండి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా వుండేలా చూడండి. శబ్దాలు కలిగించే ఆట బొమ్మల వంటివి దూరంగా వుంచండి.



Click it and Unblock the Notifications