Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్న పిల్లలకు...చిన్న, చిన్న వ్యాయామాలు!

బిడ్డలకు తేలికైన వ్యాయామాలు
నడక - ప్రతిరోజూ సాయంత్రం మీ బిడ్డతో వాకింగ్ కు వెళ్ళండి. బిడ్డ ప్లే స్కూల్ నుండి రాగానే అతనికి కొంచెం విశ్రాంతినివ్వండి. సాయంత్రం వేళ నడక ఆచరింపచేయండి. తల్లి పిల్ల ఇరువురికి దీనివలన ప్రయోజనం ఉంటుంది. నడకలో రక్తప్రసరణ అధికమవుతుంది.
క్యాచ్...క్యాచ్ - పిల్లలకు దొర్లిపోయే రంగు రంగుల బంతి అంటే ఇష్టం. పిల్లలు ...బేబీ లేదా పిల్లవాడిదశలో ఉన్నప్పటికి దొర్లిపోయే బంతిని పట్టుకోవటానికి ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తారు. కనుక,ఈ వ్యాయామం మీ బిడ్డతో తప్పక ప్రయత్నించండి. మీరు ఉద్యోగస్తులైవుండి, ప్రతిరోజూ బయటి నడకకు సమయం కేటాయించలేకుంటే, కనీసం వారానికోసారి అయినా దీనిని పాటించండి.
శరీర భాగాలు నేర్పటం - ఇది శారీరక వ్యాయామం కాదు కాని, మానసిక వ్యాయామం. పిల్లవాడి మెమొరీ అధికం కావటానికి శరీర భాగాల పేర్లు నేర్పి వారిని చూపించమనండి. పిల్లలకు మంచి నాలెడ్జి మరియు బలమైన మెమొరీ వస్తుంది.
ఎగరటం దొర్లటం - మీ బిడ్డను ఎగరటం, మీతోపాటు దొర్లటం చేయించండి. పిల్లవాడి శరీరం బాగా సాగటం, వంగటం, అవుతుంది. అతని జాయింట్లు చాలా సరళమై శరీర ఎదుగుదలకు తోడ్పడుతుంది.
మిమిక్రీ - మీ బిడ్డను ఒక జంతువు చేసే ధ్వని అనుకరించమనండి. ఉదాహరణకు, ఒక కుక్క ఏమంటుంది...భౌ, ఒక పిల్లి ఏమంటుంది మ్యావ్ వంటివి వారితో అనిపించాలి. అతనికి బాగా ఇష్టమైన కార్టూన్ సినిమాలోని వ్యక్తులను అనుకరించమని తెలుపండి.
ఈ కొద్ది రకాల వ్యాయామాలు మీ పిల్లవాడితో చేయించండి. అతనికి శారీరక, మానసిక వ్యాయామం చేకూరుతుంది. కొన్ని మానసిక ఆటలు ఆడించండి. లెక్కలు పెట్టటం, బొమ్మలు గుర్తుపట్టటం చేయించండి. అతను పెద్దవాడయ్యే సరికి శారీరకంగా, మానసికంగా బాగా అభివృధ్ధి చెందుతాడు. మీ పిల్లాడిని ఇతర పిల్లలతో చేర్చి ఆడమనండి. అదే వయసు వారితో కలపాలి. మీరు కనుక బిజీగా వుంటే, ఇతర స్నేహితులతో గడపమనండి. అపుడు మీ బిడ్డ ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications