Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
శిశువు పుట్టిన వెంటనే పరీక్షలు ఎలా?

బేబీ ముక్కు రంధ్రాలను శుభ్రంచేస్తారు, బేబీ బరువు, తల చుట్టుకొలత, బేబీ పొడవు కొలుస్తారు. కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా డ్రాప్స్ లేదా ఆయింట్ మెంట్ వంటివి వేస్తారు. వైద్య సిబ్బంది మీ బేబీని పొడిగా చేసి బేబీ ని ఒక దుప్పటిలో చుడతారు. ఇదంతే వేగంగా జరిగిపోతుంది. అతి త్వరగా బేబీని మీ చేతులకు అప్పగించి మొదటి సారి తల్లి అనుబందం కలిగేందుకు అవకాశం ఇస్తారు. మొదటి సారి పాలను పట్టే ప్రయత్నం తర్వాత అంటే షుమారు 10 నుండి 30 నిమిషాల తర్వాత మరి కొన్ని పద్ధతులు పాటించాలి.
తల్లి రికవరీ గదిలో విశ్రాంతి తీసుకుంటూ వుంటే బేబీని మరింత శుభ్రంగా స్నానంచేయించటానికి తీసుకు వెళతారు. తండ్రి బేబీ వెంట వెళ్ళవచ్చు. బేబీకి ఇంజెక్షన్ ద్వారా విటమిన్ కె ఇచ్చి రక్తం గడ్డకట్టకుండాచూస్తారు. బేబీకి హెపాటిటిస్ బి వ్యాక్సిన్ కూడా మీ అనుమతితో ఇస్తారు. మరికొన్ని పరీక్షలు ఒక ఆస్పత్రినుండి మరో ఆస్పత్రికి వేరుగా వుంటాయి. శిశువుకు షుగర్ స్ధాయి పరీక్షించటానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఏదేని వ్యత్యాసాలు కనపడితే, తక్షణమే వైద్యపరంగా చికిత్స చేస్తారు.
శిశువుకు హాస్పిటల్ వదిలే ముందు ఫెనీల్ కెటోన్యూరియా, హైపోధైరాయిడిజం, మరి కొన్ని వ్యాధుల నిర్ధారణకు మరోమారు రక్తపరీక్షచేసి ట్రీట్ మెంట్ పూర్తిచేస్తారు. పిల్లలకు వినికిడి పరీక్షకూడా చేస్తారు. యోని జననమైతే శిశువు సుమారుగా 48 గంటలలోను, సిజేరియన్ అయితే 96 గంటలలోను హాస్పిట్ నుండి డిశ్చార్జి చేస్తారు.



Click it and Unblock the Notifications