Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
త్వరగా తండ్రి అయ్యేటందుకు ఆహారాలు!

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని పరిశోధకులు 188 మంది విద్యార్ధులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి చేపలు, పండ్లు, తాజా కూరలు, పప్పు ధాన్యాలు పెట్టారు. రెండవ గ్రూపు విద్యార్ధులకు పిజ్జా, రెడ్ లేదా ప్రాసెస్డ్ మాంసం, హై ఎనర్జీ డ్రింక్స్, స్నాక్స్ వంటివి పెట్టారు.
మంచి ఆహారం తిన్న మొదటి గ్రూపు విద్యార్ధులలో వీర్యకణాలు వేగవంతమైన చలనం కలిగి గర్భవతులలోని అండం వైపుగా దూసుకుపోయాయట. పిజ్జాలు, స్నాక్స్ వంటి జంక్ ఫుడ్ తినిన గ్రూపు విద్యార్ధుల వీర్యకణాలు తక్కువ చలనం కలిగి వున్నాయని వేగంగా ఎగ్ వైపుకు దూసుకుపోలేకపోయాయని తెలిసింది. పిల్లలు పుట్టాలంటే, గర్భం సహజంగా రావాలంటే వేగవంతమైన ఫలదీకరణ చాలా అవసరమని అధ్యయన కర్త అడ్రే గాస్కిన్స్ తెలిపారు.
ఆల్కహాల్ తాగడం, జంక్ ఫుడ్ తినటం, సరైన విశ్రాంతి తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి చర్యలు పురుషులలో సంతానోత్పత్తిని తగ్గిస్తున్నాయి. వీరు తినే వివిధ రకాల ఆహారాలలో సరైన పోషకాలు వుండకపోవటం కూడా బలహీనత కలిగిస్తోంది. నెలసరి పిరీయడ్స్ సరిగా లేక మహిళలకు అండం విడుదలవంటివి సమస్యగా వుంటే పురుషులకు వీర్య కణాల సమస్యతో సరైన సమయానికి ఫలదీకరణలకు జంటల మధ్య అవకాశాలు లేకపోతున్నాయి.
కనుక పురుషుడి వీర్యం సమర్ధవంతంగా వుండాలంటే సహజమైన పోషక విలువలుకల ఆహారాలు తినాలని, దానితోపాటు నడక, పరుగు, లేదా వ్యాయామాలు వంటివి చేస్తే పురుషులలోని వీర్యకణాలు మంచి చలనం కలిగి సమర్ధవంతంగా గర్భాశయంలోని అండాన్ని చేరి గర్భం ధరించటానికి కారణమవుతాయని అధ్యయనం తెలిపింది.



Click it and Unblock the Notifications