Just In
- 28 min ago ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- 51 min ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 4 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 5 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
బిడ్డ పొట్టలో గ్యాస్ నివారణకు చిట్కాలు
బేబీ ని అడ్డంగా చేతులలో లేదా ఊయలలో పడుకోబెట్టటానికి బదులు, నిలువుగా వుంచండి. ఈ చర్య బేబీలోని గ్యాస్ జీర్ణ వ్యవస్ధలో సర్దుబాటు చేసుకునే అవకాశం వుంటుంది. ఈ సమయంలో అధికంగా బిడ్డను ఎత్తుకొని ఆందోళన చెందకండి. పొట్టలో గ్యాస్ వుంటే పిల్లలకు మీ స్పర్శ కావాలి. బిడ్డ పొట్టను సున్నితంగా మర్దన చేయండి. ఇది చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
బిడ్డ చేతులను, కాళ్ళను కొద్దిపాటిగా కిందకు, పైకి ఆడించండి. గ్యాస్ బయటకు వచ్చేందుకు ఈ చర్య సహకరిస్తుంది. నొప్పి ఎక్కువయ్యే కొద్ది బిడ్డలు, వారంత వారే కాళ్ళు, చేతులు ఆడించటం చూస్తూనే వుంటాం. బిడ్డను పొట్టపై బోర్లా పడుకోపెట్టి వెన్ను భాగం మర్దన చేయండి. బేబీకి తాగగలిగితే హెర్బల్ టీ అతి కొద్దిగా పట్టండి. ఇది చాలా సురక్షితమేనని వైద్యులు కూడా చెపుతారు. హెర్బల్ టీ ఔషధంగా ఇచ్చినప్పటికి, బేబీ యొక్క పోషకావసరాలను అశ్రధ్ధ చేయకండి.