Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పిల్లలలో డయాబెటీస్ కనుగొనడమెలా?

1. దాహం - బేబీ దాహం వేస్తోందని తెలుపలేదు. కనుక మీరే తెలుసుకోవాలి. ప్రతిరోజూ మీ బిడ్డ ఎన్ని నీళ్ళు, ద్రవాలు తాగుతోందనేది గమనించి వేరే పిల్లల రికార్డుతో పరిశీలించండి. వ్యత్యాసం అధికంగా వుంటే, మరిన్ని పరీక్షలు చేయించండి.
2. తరచుగా మూత్రం పోయటం - బిడ్డలు ఎంత తరచుగా మూత్రం పోస్తారనేది చెపటం కష్టం. ముందుగా వారికి శిక్షణ లేదు కనుక వారు ఎపుడూ పోస్తూనే వుంటారు. అయితే, రోజుకు డయాపర్లు ఎన్ని వాడుతున్నారనేది కూడా గమనించండి.
3. వేగంగా బరువుతగ్గటం - బేబీలలో ఇది గమనించటం కూడా కష్టమే. చాలామంది పిల్లలు చిన్నతనంలోనే బరువును త్వరగా కోల్పోతూంటారు. కాని మీ బిడ్డ కనుక బాగానే ఆహారంతీసుకుంటూ చురుకుగా లేకుండా బరువు కోల్పోతుంటే డయాబెటీస్ కొరకు పరీక్షలు చేయించండి.
4. అలసట, బలహీనత - సాధారణంగా బేబీలు ప్రతి రెండు మూడు గంటలకు నిద్రిస్తారు. ఆ నిద్ర దీర్ఘంగా కొనసాగుతూంటే పరీక్ష చేయించండి. బేబీ ఆడటానికి ఇష్టపడకపోయినా, అధికగంటలు నిద్రిస్తున్నా రోగనిరోధకత సరిలేకున్నా, డాక్టర్ వద్ద సలహా సంప్రదింపులు పొందండి.
5. మానని గాయాలు - పిల్లాడికి తగిలిన చిన్నపాటి దెబ్బలు, కోతలు, పుండ్లు వంటివి తగ్గటానికి అధిక సమయం పడుతూంటే, అది డయాబెటీస్ కావచ్చు. కనుక పరీక్ష జరిపించండి.
పిల్లలలో డయాబెటీస్ సాధారణంగా టైప్ వన్ గా వుంటుంది. అంటే వీరిలో పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. శిశుదశలో బ్లడ్ షుగర్ వచ్చే కారణాలలో ఇది ప్రధానం. దీనికిగాను పరిష్కారంగా ఇన్సులిన్ బయటనుండిఇంజెక్షన్లద్వారా తీసుకుంటూ, షుగర్ తక్కువ తీసుకుంటూ నియంత్రించాలి. రెగ్యులర్ గా ప్రతి నెలా పిల్లలలో బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించాలి.
మీ పిల్లలలో డయాబెటీస్ వుందా అనే అనుమానాలను పోగొట్టుకోటానికి ఈ చర్యలు పాటించండి. వారి భవిష్యత్తును కాపాడండి.



Click it and Unblock the Notifications