For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుజ్జాయి హ్యాపీగా ఫీలవ్వాలంటే.....

|

Is The Baby Diaper Better
ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టే పాపాయి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెడితే ఆకలి అనుకోవడం సహజమే. అయితే అది కొన్ని సార్లు న్యాపీ ర్యాస్ కూడా కావచ్చు. అలా జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

1. కొందరు తల్లులు పొద్దున వేసిన న్యాపీ తడిసి పోతే కానీ మార్చరు. కానీ దాని వల్ల చర్మం రాపిడికి గురవతుంది. తడిసన చోట తేమతో ఫంగస్ చేరుతుంది. దీనిని గమనించుకొని తరచూ న్యాపీ మార్చాలి.

2. వస్త్రంతో చేసినవి వాడినప్పుడు శుభ్రం చేసేటప్పుడు సబ్బులు, ఇతర సాధనాల వల్ల సమస్య ఎదురవకుండా చూసుకోవాలి. తొడిగిన చోట ఎర్రగా కందిపోయినా, చర్మం ఒరుసుకుపోయినట్లున్నా, దాన్ని ర్యాష్ గా పరిగిణించాలి. వస్త్రాలతో చేసిన వాటిని వేడినీళ్లల్లో ఉతకాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బుల్ని ఎంచుకోవాలి. ఎండలో ఆరేస్తే క్రిముల సమస్య ఉండదు.

3. మూత్రం పోసినప్పుడు దుస్తులు దుప్పట్లు పాడవకుండా డైపర్ ను బిగుతుగా కడుతుంటారు. దానితో ఆ ప్రాంతంలో గాలి చేరక పట్టేసినట్లు అవుతుంది. దాంతో ర్యాష్ తప్పదు. న్యాపీ మార్చిన ప్రతిసారి ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తుడవాలి. తడి పూర్తిగా ఆరాక కొద్ది సేపు ఆగి ఆపై మరొకటి వేయాలి. అప్పుడే సమస్యను కొంత వరకు తగ్గించవచ్చు.

4. న్యాపీలే కాదు, తుడిచే వైవ్స్ నూ జాగ్రత్తగా ఎంచుకోవాలి. సౌకర్యంగా ఉంటుందని ప్లాస్టిక్ రబ్బరు ప్యాంట్లు వేయడం ఎక్కువతోంది. కానీ వాటి వాడకం మంచిది కాదు.

5. పాపాయికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు న్యాపీల్లో పౌడర్ వేస్తుంటారు కొందరు. కానీ దాని వల్ల వాటిల్లో క్రిములు చేరే సమస్య మొదలవుతుంది.

6. ఈ సమస్య రెండు మూడు రోజులుగా వేధిస్తున్నా, జ్వరం వస్తున్నా, ర్యాష్ ఇతర భాగాలకూ చేరినా, పొక్కుల్లా వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

English summary

Is The Baby Diaper Better Or The Cloth Napkins.. | బుజ్జాయి హ్యాపీగా ఫీలవ్వాలంటే.....

Are you always confused about the using diapers or napkins for your babies?. It is confusing as people prefer both based on their budget and baby comfort. Today we shall on the aspect whether baby diaper is better than napkin or is it vice versa. Take a look.
Story first published:Monday, April 16, 2012, 18:32 [IST]
Desktop Bottom Promotion