Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
కొత్తగా పుట్టిన శిశువులో కామెర్లు!

కొత్తగా పుట్టిన పిల్లలలో కామెర్లకు కారణం ఏమిటి?
బిలిరూబిన్ అనే పసుపురంగు పదార్ధం రక్తంలో అధికమై కామెర్లు కలిగిస్తుంది. రక్తం ఈ పదార్ధాన్ని వ్యాపింపజేసి చర్మం కింద డిపాజిట్ చేస్తుంది. కనుక చర్మం పసుపురంగుకు మారుతుంది. లివర్ వీరిలో బలహీనంగా వుండటం చేత ఈ పదార్ధాన్ని తొలగించలేదు. బిలిరూబిన్ పదార్ధం మలం ద్వారా బయటకు రాకపోతే, పేగులు దానిని పీల్చుకుని కామెర్లు కలిగిస్తాయి. నెలలు నిండకనే ముందుగా పుట్టడం బలహీనమైన లివర్, తల్లిపాలు మొదలైన కారణాలుగా కూడా బేబీలలో కామెర్లు వస్తాయి.
బేబీలో వచ్చే ఈ కామెర్లకు చికిత్స ఎలా?
కామెర్లను ఫొటో ధిరపీ అనే వైద్యంతో తగ్గిస్తారు. ఈ పద్ధతిలో బేబీని వేడిగా వుండే లైట్ కింద ఒకటి లేదా రెండు రోజులు పడుకోపెడతారు. ఈ లైటు బల్బలు అధికంగా వున్న బిలిరూబిన్ ను నీటిలో కరిగిస్తాయి. అపుడు అది మూత్రం లేదా మలం ద్రవారా బేబీ శరీరంనుండి బయటకు విసర్జించబడుతుంది. ఈ ప్రక్రియలో బేబీ కళ్ళు నల్లని కంటిఅద్దాలతో కప్పేస్తారు. బేబీకి తల్లిపాలు లేదా ఇతర పాలు వంటివి పట్టి మలం బయటకు వచ్చేలా చేస్తారు.
కొత్తగా పుట్టిన బిడ్డలలో కామెర్ల చికిత్సకుగాను ఫైబర్ ఆప్టిక్ బ్లాంకెట్లు వాడుతున్నారు. అయినప్పటికి ఫొటో ధిరపై ద్వారా బిలిరూబిన్ పదార్ధ స్ధాయి తగ్గకపోతే అపుడు బేబీ రక్తాన్ని వేరే వారి రక్తంతో బదిలీ చేసి వ్యాధికి చికిత్స చేస్తారు.



Click it and Unblock the Notifications
