Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
మందు కొడితే....మామ్ మరీ పర్ఫెక్ట్!

తల్లులు ఇపుడు తమ పిల్లలకు తాము సూపర్ మామ్ అయిపోవాలని తరచుగా ఆల్కహాల్ తీసుకుంటున్నారని ఒక తాజా స్టడీ తెలిపింది.
తల్లులు ఆచరించే ఈ కొత్త రకం జీవన విధానం పిల్లను డిప్రెషన్, ఆందోళనలలోకి నెట్టేస్తోందట. మారుతున్న జీవన విధానాలను అధ్యయనం చేస్తూ, అందరికి ఊరటనిచ్చే టర్నింగ్ పాయింట్ సంస్ధ ఈ రకమైన తాజా తల్లుల జీవన విధానం గురించి తెలిపిందని డైలీ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడి చేసింది. ఈ సంస్ధ దాని తాజా స్టడీలో ఇంగ్లాండు లో సుమారు 2.6 మిలియన్ల పిల్లలు ఈ రకంగా ఆల్కహాల్ తాగే తల్లితండ్రుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 2010 మరియు 2011 సంవత్సరాల మధ్య సుమారు 12 వేలమంది తల్లితండ్రులు ఈ సంస్ధ నుండి తమ ఆల్కహాల్ సమస్యలకు పరిష్కారాన్ని కోరారట. వీరిలో షుమారు రెండు వేలమంది వరకు తల్లులే వున్నారట.
రోజుకు ఒక పేరెంట్ సగటున 30 యూనిట్ల ఆల్కహాల్ తాగుతున్నాడట. అంటే ఇది అక్కడి ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే 10 రెట్లు ఎక్కువట. తల్లి లేదా తండ్రి ఈ రకంగా తాగేయటానికి కారణం, తాము తమ పిల్లలను కట్టడి చేయటంలో సూపర్ మామ్ లేదా సూపర్ డాడ్ అయిపోవాలన్న ఆందోళనలతో తాగేస్తున్నట్లుగా ఈ సంస్ధ వెల్లడిచేసింది. మరికొంతమంది....నా మొగుడు లేదా భార్య కనుక పిల్ల లేదా పిల్లాడి పట్ల కొంత భాధ్యత తీసుకుంటే నేనెందుకు తాగుతాను ? అని కూడా ప్రశ్న వేశారట. కొంతమంది వారానికి కనీసం మూడు రాత్రులుగా సుమారు ఎనిమిది బాటిళ్ళ వైన్ లాగించేస్తున్నారట. అయితే, వీరు తాగేది పిల్లలు రాత్రి బెడ్ చేరుకున్నాక మాత్రమే అని కూడా నివేదిక వెల్లడించింది.



Click it and Unblock the Notifications