Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పసిపిల్లల పెంపకంపై కొన్ని అపోహలు!

బేబీల పెంపకంపై కొన్ని అపోహలు -
1. బిడ్డ పుట్టిన మూడు రోజులవరకు తల్లిపాలు ఇవ్వరాదు. ఇది వాస్తవం కాదు. పాలు పట్టకపోతే బిడ్డకు ప్రమాదం కూడాను. డెలివరీ తర్వాత మహిళకు స్తనాలలో తెల్లటి ద్రవం వస్తుంది. దీనిని ముర్రుపాలు అంటారు. వీటిని బిడ్డకు తప్పక తాగించాలి. బిడ్డకు మంచి రోగనిరోధక వ్యవస్ధ శరీరంలో ఏర్పడి భవిష్యత్తులో వ్యాధులు రాకుండా వుంటాయి.
2. మా బిడ్డ కళ్ళు నీలిరంగులో ఎంతో బాగున్నాయి అంటారు బిడ్డపుట్టిన వెంటనే. కాని ఇది వాస్తవంకాదు. శిశువు కు కార్నియా పూర్తిగా ఏర్పడకపోవటంతో కళ్ళు ఈ రంగు వుంటాయి. కార్నియా డెవలప్ అయిందంటే బేబీ కళ్ళు షుమారుగా 6 నెలల కాలంలో తమ స్వంత రంగును సంతరించుకుంటాయి.
3. మా బేబీకి ఆయిల్ మసాజ్ కావాలి అనుకుంటారు. అవసరంలేదు. బేబీకి చిన్నతనంలోనే నూనె గ్రంధులు ఏర్పడవు. కనుక మీరు పెట్టే నూనె అనవసరం. వాస్తవానికి మీరు పెట్టే నూనె చర్మం కణాలు పీల్చుకోలేవు.
4. ఎండలో బేబీ ని వుంచితే ఎముకలు గట్టిపడతాయి. బేబీకి చిన్నతనంలో నూనె గ్రంధులు వుండవు కనుక సూర్యరశ్మికి అధికంగా గురి చేయకండి. ఎండ వేడిమి అధికంగా వుంటే, లేత చర్మం కమిలిపోయి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా వుంటుంది.
5. బేబీ ఏడిస్తే అలసిపోతుంది. ఇది మీ అపోహ మాత్రమే. బేబీ బాగా ఏడ్వాలి. ఏడిస్తే బేబీ గుండె గట్టిపడుతుంది. నోరంతా తెరిచి ఏడిస్తే బేబీ ఊపిరితిత్తులు పూర్తిగా సాగి వ్యాయామంగా వుంటుంది. ఏడ్వటం బేబీకి ఆరోగ్యం. గొంతు లేదా స్వరధ్వని మెరుగవుతుంది. కనుక బేబీని ఏడ్వనివ్వండి.
మీరు కొత్తగా తల్లి అయినవారైతే, సాంప్రదాయక పద్ధతులను ఆచరించక, సరైన అనుభవం కలవారిని, వైద్యులను సంప్రదిస్తూ మీ బేబీ పెంపకం చేయండి. అపోహలు తొలగించే మరిన్ని చిట్కాలు మీకు బేబీ పెంపకంపై తెలిస్తే వాటిని మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications