Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకు ఇంటిలో యాక్సిడెంట్లు జరగకుండా....!

పిల్లల భధ్రతకు ఇంటిలో కొన్ని చిట్కాలు ఎలా పాటించాలి?
ప్రధానంగా 3 లేదా 4 సంవత్సరాల వయసు పిల్లలు ఎల్లపుడూ ఇంటి వద్దే ఆడుకుంటారు కనుక వీరికి అనుకోని గాయాలు తగులుతూంటాయి. వీరికి ఎటువంటి ఆపద కలుగరాదని అనుకుంటే, పర్యవేక్షణ ఎంతో అవసరం. ఎంత పర్యవేక్షించినప్పటికి ప్రతి రోజూ లేదా ప్రతి సెకండ్, వీరిని చూస్తూనే వుండటం జరుగకపోవచ్చు. పిల్లలకు ఇంటిలో జరిగే చిన్నపాటి దుర్ఘటనలు ఎలా వుంటాయంటే....
పిల్లలకు కాల్పులు, మంటల కారణంగా, గాయాల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఉక్కిరిబిక్కిరి అవటం, నీటిలో మునిగి పోవటం, పడిపోవటం, తినకూడని పదార్ధాల విషం, టపాసులవంటి వాటివలన ఈ దుర్ఘటనలు పిల్లలకు జరుగుతాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అంచనాల మేరకు పిల్లలకు యాక్సిడెంట్లు చాలావరకు కింది వాటితో జరుగుతాయి.
నీటి సంబంధం - బాత్ రూమ్, కిచెన్, స్విమ్మింగ్ పూల్, లేదా నీటి తొట్టి వేడి
వేడి మంటలు -కిచెన్ లో లేదా బార్బెక్యూ గ్రిల్
విషపదార్ధాలు - కిచెన్ సింక్, మెడిసిన్ కేబినెట్, గరాజ్ లేదా గార్డెన్ షెడ్ లేదా మందులుంచే ప్రదేశం
పడిపోయే ప్రదేశాలు - మెట్లు, జారిపోయే నేలలు, ఎత్తైన విండోలు, లేదా జారిపోయే ఫర్నిచర్
కనుక ఈ ప్రదేశాలు పిల్లలకు సురక్షితంగా వుండేలా చేయాలి. పిల్లలు సాధారణంగా ఈ ప్రదేశాలలోనే సంచరిస్తూ వుంటారు.లేదంటే హానికర వస్తువులు, నోటిలో పెట్టుకోవటం, స్టవ్ వద్దకు వెళ్ళటం, వంటివి కూడా చేస్తారు. ఏది ఏమైనప్పటికి మీ పర్యవేక్షణ మాత్రమే శిశువును రక్షిస్తుంది. మీరు ఇంటిలో పిల్లలకొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఏదో ఒక సమయంలో పిల్లలు పెద్దల కన్ను కప్పి హానికరమైన చర్యలు కు గురవుతూనే వుంటారు. కనుక అటువంటపుడు, ఎమర్జెన్సీలో వారికి చికిత్సకుగాను మీరు కొన్ని ప్రాధమిక చికిత్సలు నేర్చుకొని వుండాలి.
పిల్లల వైద్యుల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వుండాలి. పిల్లల ఆస్పత్రి ఎక్కడవుందో తెలుసుకొని వుండాలి. అవసరమనుకుంటే, ఇరుగు పొరుగుల సహకారం తీసుకొని జాగ్రత్త పడాలి. పిల్లవాడు పెరిగి గ్రహించగలిగే వరకు ఇంటివద్ద తల్లితండ్రులుగా మీరే కాక, ఒక ఆయా లేదా పెద్దవారు ఇతరులు కూడా పిల్లల కదలికలను పరిశీలిస్తూండాలి.తల్లి బిడ్డ నిద్రిస్తున్న సమయంలోనే తనకుగల ఇతర పనులను చక్కబెట్టుకోవాలి. తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే, నేడు ఆధునికంగా వస్తున్న డే కేర్ వంటి సంస్ధల సహాయ సహకారాలు పొందాలి.



Click it and Unblock the Notifications