Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బేబీకి దంతాలు వస్తూంటే?

సాధారణంగా బేబీకి 6 నెలలు వయసు వచ్చిందంటే పళ్ళు రావటం మొదలెడతాయి. కొన్ని మార్లు 3 నెలలనుండే మొదలై ఒక సంవత్సరం వయసు వరకు రావచ్చు. ముందుగా కింది దంతాలు ఏర్పడతాయి. సరిగ్గా మూడు సంవత్సరాలు వచ్చే సరికి మీ బిడ్డకు 20 ప్రధాన దంతాలు వస్తాయి. ఈ సమయంలో మీ బేబీకి చాలా నొప్పిగా వుంటుంది. కారణం. చిగుళ్ళు వాపు, పుండు పడటాలుగా వుంటుంది. నొప్పి పన్ను వచ్చే ముందర 3 నుండి 5 రోజులు వుంటుంది. ఆ సమయంలో వారు తమ వేళ్ళను కొరుక్కోవటం లేదా బొమ్మలను కొరకటం వంటివి చేసి కొంత బాధనుండి దూరం అవుతారు. తినటం , తాగటం వంటివి కూడా మానేస్తారు.
ముఖం, ఛాతీ, అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్లు అవుతుంది. ఈ లక్షణాలు సాధారణమే. అయితే, నొప్పి అధికంగా వుంటే మీరు ఆమెను డెంటిస్ట్ వద్దకు తీసుకువెళ్ళండి. వారి నొప్పిని తగ్గించటానికి సింపుల్ గా ఇంటివద్దే ఏం చేయవచ్చో కూడా చూడండి. మొదటగా మీ బేబీ నోటిలోని చిగుళ్ళను మసాజ్ చేయండి. ( దానికి ముందర మీ చేతిని బాగా శుభ్రం చేసుకోండి). మసాజ్ కు గాను ఆలివ్ ఆయిల్, వనిల్లా, జింజర్ రూట్ వంటివి లేదా లవంగ నూనె వంటివి ఉపయోగించండి. బేబీకి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
చల్లగా వుండే వస్తువులను నమలటం బేబీకి సుఖాన్నిస్తుంది. చిన్న కాటన్ గుడ్డలో ఐస్ పెట్టి బేబీ చిగుళ్ళపై పెట్టండి. చల్లదనం ఆమెకు హాయినిస్తుంది. ఐస్ ముక్క నేరుగా నోటిలో పెట్టకండి. అది చిగుళ్ళను నష్టపరుస్తుంది. లేదా చిగుళ్ళకు రాసే జల్ వంటిది కూడా ఫ్రిజ్ లో పెట్టి చల్లబరచండి. కొంతమంది బేబీలు, బేబీ బ్రష్ లను ఆనందంగా నమిలేస్తారు. అది వారికి మంచిది. దంతాలు వచ్చేటపుడు కొరకటానికి గాను నేడు మార్కెట్ లో పిల్లలకు కొన్ని కొరికే బొమ్మలు కూడా లభ్యమవుతున్నాయి. అయితే వాటిని ఎప్పటికపుడు శుభ్రం చేస్తూ వుండండి.
ఈ సింపుల్ చిట్కాలే కాక, మీరు బేబీకి ఎంతో ప్రేమ చూపాలి, దగ్గరకు తీసుకొని లాలించాలి, కౌగలించండి. ఆమె బాధ ఉపశమిస్తుంది. ఈ కొత్త నొప్పికి చిన్నపిల్లలు ఎంతో భయపడతారు. కనుక వారు భధ్రంగా మీ సంరక్షణలో వున్నారనే భావన వారికి కలిగించాలి.



Click it and Unblock the Notifications
