Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చలికాలంలో బేబీ జాగ్రత్తలు ఎలా? !

మసాజ్ చేయించేటపుడు మరే ఇతర పనులు పెట్టుకోవద్దు. టీవీ చూస్తూ లేదా కబుర్లు చెపుతూ ఉంటే చేసే మసాజ్ పై మీరు పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. హడావుడి పడకుండా స్ధిమితంగా చేతి మునివేళ్ళతో మెత్తగా మసాజ్ చేయాలి. తర్వాత ప్రశాంత వాతావరణంలో ఊయలలో వేసి ప్రేమగా జోలపాట పాడితే పిల్లలు చాలా సేపు హాయిగా నిద్రపోతారు. తల్లితండ్రులు పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా అవసరమని గ్రహించాలి. ప్రతి రోజూ మసాజ్ కు సమయం కేటాయించలేకున్నా, కనీసం వారానికొకసారి పిల్లలకు మసాజ్ చేస్తూండాలి. మసాజ్ స్నానం చేయించేటపుడు మీ చేతి గాజులు, వాచీ లేదా ఉంగరాలు, మెడలో గొలుసు వంటివి తీసేయండి. అవి గుచ్చుకుంటే పిల్లలు ఏడుస్తారు. కారణం తెలియక మనకు ఆందోళన కలుగుతుంది. పిల్లలకు మృదువుగా, మెత్తగా మసాజ్ చేస్తే చిరాకు లేకుండా సహకరిస్తారు. మెడపైన, పొట్టపైన సున్నితంగా రుద్దుతూ మసాజ్ చేస్తే పిల్లలు పేచీ పెట్టరు. పని సులువవుతుంది. వంటికి రాసిన నూనె పూర్తిగా శరీరానికి ఇంకేటంతవరకు సున్నితంగా పొట్ట, కాళ్ళు, చేతులు రుద్దండి. ఆపై బిడ్డ భరించగలిగిన మేరకు వేడిగల నీటిని వాడి స్నానం చేయించండి.
చలికాలంలో పిల్లలకు కూడా సరైన దుస్తులు కూడా ఎంతో అవసరం. ఇందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి.
1. మెత్తటి కాటన్ గుడ్డలు ఎంపిక చేయండి. సింధటిక్ గుడ్డలైతే ర్యాషెస్ వస్తాయి.
2. బేబీకి కొన్న గుడ్డలు వాష్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత వేయండి.
3. డ్రాయర్ వుండి శరీరమంతా ఫుల్ గా వున్న డ్రస్ బాగుంటుంది.
4. వేడి ప్రదేశాలలో మీరుంటే పలుచటి గుడ్డలు బేబీకి ధరింపచేయండి. అదనపు గుడ్డలు, టోపీలు పెట్టకండి.
5. మీరుండేది చలిప్రాంతమైతే, చేతులు, కాళ్ళు పూర్తిగా కవర్ చేసే సూటు వేయండి. చలికాలంలో కాటన్ సాక్స్ వేస్తే, టోపీ పెడితే బేబీకి సౌకర్యంగా వుంటుంది.
6. ఫ్రంట్ లో బటన్లు వుండే దుస్తులు బేబీకి వేయటానికి తీయటానికి బాగుంటాయి. ఎలాస్టిక్ వున్న దుస్తులు వాడకండి.
7. బేబీకి డైపర్లు ప్రధానం. దీనికి గాను క్లాత్ మాత్రమే వాడండి. ఉపయోగించిన వెంటనే వాటిని తీసేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డలు చలికాలంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.



Click it and Unblock the Notifications