For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బుజ్జాయికి ఆయిల్ మసాజ్ తో బోలెడు ప్రయోజనాలు.!

|

పసిపిల్లలకు ఆయిల్ మసాజ్ చేయడం మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. బేబీలకు ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల వారి ఎముకలు బలపడతయానేది వారి నమ్మక. మన నానమ్మ, అమ్మమ్మలు ఇలా చేయడాన్ని మనం గమనించే ఉంటాం. ఉదయాన్నే సన్నగా పడే సూర్యకిరణాల మద్య కాళ్ళ మీద పసిపిల్లలను పడుకోబెట్టుకొని ఆయిల్ మాసజ్ చేయడం వల్ల అటు సూర్యరశ్మి వల్ల విటమిన్ డి కూడా శరీరంలో రూపొందుతుంది. పాశ్చాత్య తత్వశాస్త్రం మాత్రం బేబీ మసాజ్ కు మద్దతు ఇవ్వదు. అయితే, చివరికి కొన్ని సైంటిఫిక్ నిర్ధారణల ప్రకారం బేబీకి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కనుగొనబడింది.

మీ బుజ్జాయికి మసాజ్ అవసరమా?సందేహం లేకుండా అవుననే చెప్పాలి. ఈ విధానాన్ని ప్రారంభించడానికి మరియు మీరు ఉపయోగించే కొన్ని మసాజ్ పద్దతులను తెలుసుకోవడం చాలా అవసరం. మీరు బేబి గురించి జాగ్రత్త తీసుకొనే వారైతే మీకు ఖచ్చితంగా మీ బిడ్డ ఆయిల్ మసాజ్ ఎందుకు అవసరం అని తెలుసుకోవాలి. అందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

ప్రశాంతతను పొందుతారు: మీ బేబీకి మసాజ్ చేయడం వల్ల, బేబీ ఒక్కటే కాదు ఎవరికైనా సరే ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అది ఎలా అంటే మసాజ్ వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్'ఆక్సిటోసిన్ మీ శరీరంలో రూపొందుతుంది. ఈ హార్మోన్ వల్ల మీ మంచి మూడ్ ను ఎక్కువ చేస్తుంది. కాబట్టి మీ బేబీకి మసాజ్ చేయడం వల్ల మీరు బేబీ యొక్క ఫీల్ గుడ్ హార్మోన్స్ ను ఉత్తేజపరచవచ్చు.

Why Your Baby Needs Oil Massage

ఆత్మస్థైర్యం: తల్లి స్పర్శ బిడ్డకు తగలగానే వారిలో ఆత్మస్థైర్యం నెలకొంటుంది. కాబట్టి, బిడ్డకు తల్లి స్పర్శ తెలియాలంటే ఫిజికల్ టచ్ అవసరం. దాంతో బేబీ సంతోషంగా పెరుగుదలకు ఒక గొప్ప మార్గం అవుతుంది. ఎప్పుడైతే మీ బేబికి ఆయిల్ మసాజ్ చేస్తారు అప్పుడు మీ బిడ్డ మీతో అలాగే మీరు మీబిడ్డతో సంబంధాలు మరి బలపడానికి సహాయం చేస్తుంది.

గాఢ నిద్ర: పసిపిల్లలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల గాఢ నిద్రను పొందుతారు. బేబీ శరీరానికి మసాజ్ చేయడం వల్ల బేబీ బాడీలోని కండరాలు రిలాక్స్ చెంది బేబీని గాఢ నిద్రలోనికి తీసుకెళుతుంది. దాంతో ఎక్కువ సేపు నిద్ర పోయి, ఎక్కువ విశ్రాంతి పొందుతారు.

బిడ్డ సంతోషంగా ఉంటుంది: ఏడ్చే పిల్లను ఎత్తుకోవడం కానీ, అటువంటి పిల్లలతో ఆడడం కానీ చాలా మందికి ఇష్టం ఉండదు. కొంత మంది పిల్లలను గమనించినట్లైతే వారు ఎప్పుడు ఏడవడం, నిరంతరం కేకలు పెట్టడం చేస్తుంటారు. అటువంటి వారిని దగ్గరకు తీసుకోవాలన్నా భయమే ఏమి అనకుండానే బోరున ఏడ్చేస్తుంటారు. మరి అటువంటి పిల్లలు మీకు వద్దనుకుంటే.. మసాజ్ మీ పిల్లలకు బాగా సహాయపడుతుంది. మీ పిల్లల్ని ప్రశాంతగా ఉంచుతుంది. ఏడవడాన్ని తక్కువ చేస్తుంది. దాంతో ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటారు.

మెరుగ్గా ఉంటారు: పిల్లలు పుట్టిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ నడవలేకపోతున్నట్లైతే, ఆ బిడ్డ యొక్క కండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అందుకు బేబీ మసాజ్ చాలా సహాయపడుతుంది. దాంతో బేబీ యొక్క కండరాలు మరియు జాయింట్స్ వదులవుతాయి. కాబట్టి చిన్న వయస్సులో ఉన్న పిల్లలకు రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల అతి త్వరగా లేచి నిలబడి నవడానికి సహాయపడుతుంది.

English summary

Why Your Baby Needs Oil Massage? | మీ బుజ్జాయికి ఆయిల్ మసాజ్ ఎందుకు..?

It is part of Indian tradition to massage the baby with oil to strengthen the bones. We have all grown up seeing grandmothers giving little babies a fine oil massage and laying them in the morning sun to generate Vitamin D in the body. Western philosophy did not support baby massage for a long time. But finally, scientific proof has been found that there are many benefits of massaging a baby.
Story first published: Saturday, March 30, 2013, 13:15 [IST]
Desktop Bottom Promotion