Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
దంతాలు వచ్చే సమయంలో పిల్లలు బరువు తగ్గుతారా?
శిశువులలో నాలుగు నెలలు వచ్చినప్పటి నుంచి టీతింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రతి శిశువులో టీతింగ్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. శిశువుకు చేరుతున్న కాల్షియం వంటి ఎన్నో అంశాలు టీతింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాల పళ్ళు ఊడిపోయే ప్రతీసారి పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి మందగిస్తుంది.
అయితే, టీతింగ్ ప్రాసెస్ మొదలయ్యేటప్పుడు పిల్లల బరువు తగ్గుతారా? ఇదే ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తుంది. ఇది సాధారణమే. పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. పళ్ళు వచ్చే సమయంలో ఉండే అసౌకర్యం వల్ల పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల బరువు తగ్గుతారు.
చిగుళ్ళ నొప్పి, మంట ఇవన్నీ టీతింగ్ ప్రాసెస్ వల్ల కలిగేఅసౌకర్యాలు. చిగుళ్ళలోంచి పళ్ళు బలంగా బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పిల్లలు నొప్పితో బాధపడతారు. అందువల్ల ఆకలి మందగిస్తుంది. పళ్ళు చిగుళ్ళలోంచి బయటకు రావడానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచే పిల్లల్లో అసౌకర్యం మొదలవుతుంది. మరో మూడు రోజుల పాటు ఈ అసౌకర్యం కొనసాగుతుంది.

ఇంతకు ముందు చెప్పుకోబడిన కారణాల వల్లే పళ్ళు వస్తున్న సమయంలో పిల్లలు బరువు తగ్గుతారా? ఈ విషయం తెలుసుకోవాలంటే పిల్లల్లో టీతింగ్ ప్రాసెస్ మొదలయినప్పుడు ఈ అంశాలను తప్పక గమనించాలి.

హైడ్రేషన్
టీతింగ్ ప్రాసెస్ లో పిల్లలు అసౌకర్యానికి గురవుతారన్న విషయం తెలిసినదే. నొప్పితో పిల్లలు అసౌకర్యానికి గురవడం వల్ల సరిగ్గా తినలేరు, ఏమీ తాగలేరు. దీని వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. డీహైడ్రేషన్ నుంచి వారిని రక్షించడానికి తరచూ వారికి ద్రవాలను అందివ్వాలి. అందువల్ల వాళ్ళు హైడ్రేటెడ్ గా ఉంటారు.
ఎలక్ట్రోలైట్ భర్తీ
డీహైడ్రేషన్ మరీ తీవ్ర స్థాయికి చేరినప్పుడు పీడియాట్రిక్ ఎలక్ట్రోలైట్ రీప్లేస్ మెంట్ సొల్యూషన్స్ పై దృష్టి పెట్టాలి. పిల్లల్లో సోడియం శాతాన్ని తగినంత అందించి వారిని హైడ్రేట్ చేసేందుకు ఈ పద్దతి తోడ్పడుతుంది.

నొప్పి నివారిణి
ఎసిటమైనోఫెన్ వంటి ఓరల్ పైన రిలీవర్స్ పిల్లల్లో పళ్ళు వచ్చేటప్పుడు కలిగే చిగుళ్ళ నొప్పిని తగ్గిస్తాయి. పిల్లలు నొప్పితో విలవిలలాడుతుంటే ఈ పద్దతిని ఉపయోగించవచ్చు. వైద్యుడి పర్యవేక్షణలోనే ఈ మెడికేషన్స్ ను ఉపయోగించాలి.
హై కేలరీ డ్రింక్స్
టీతింగ్ వల్ల కలిగే నొప్పితే పిల్లలు తినడానికి మొరాయిస్తూ ఉంటే ఈ పద్దతిని పాటించాలి. నొప్పితో పిల్లలు మీకు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. కాబట్టి మీరు సహనంగా వారితో ప్రవర్తించాలి. పిల్లలు కొంచెం బెటర్ గా ఫీల్ అయినప్పుడు హై కేలరీ డ్రింక్స్ ను లేదా చిన్న చిన్న మోతాదులలో భోజనాన్ని పిల్లలకి అందించాలి. తద్వారా వారు ఆకలితో బాధపడరు.

చల్లని పదార్థాలు
చల్లటి పెరుగు, తాజా పళ్ళు టీతింగ్ వల్ల ఎదురయ్యే అసౌకర్యాలను అరికడతాయి. మీ పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే ముందు ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని కొద్ది సేపు ఉంచాలి. చల్లని పదార్థాలు పిల్లలకి నొప్పిని తప్పిస్తాయి.
సాఫ్ట్ ఫుడ్స్
సులభంగా నమలగలిగే ఆహార పదార్థాల్ని పిల్లలకి ఈ సమయంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా ఆహారాన్ని తినే ముందు రబ్బర్ టీతింగ్ రింగ్ లేదా ఉతికిన వస్త్రం వారికి ఇస్తే నొప్పి వల్ల కలిగే బాధ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది.

టీతింగ్ ప్రాసెస్ వల్ల మీ పిల్లలు అసౌకర్యానికి గురవుతున్నారని భావిస్తే ఈ ఐడియాస్ ను పాటించండి.



Click it and Unblock the Notifications