Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్నారికి దిండు వాడడం సురక్షితం కాదా?
చిన్నారికి దిండునివ్వడం మంచిదేనా? చిన్నారికి పిల్లో అవసరం ఉండదు. నిజానికి, కనీసం రెండేళ్ళ వరకు పిల్లలకు పిల్లో అవసరమే ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మీ చిన్నారి ఎదుగుతున్న కొద్దీ దిండుని ఉపయోగించే అవకాశం వస్తుంది.
చిన్నారికి పిల్లో వాడడం మంచిదేనా? మొదటగా మీ చిన్నారి బోర్లా పడి నిద్రపోకుండా జాగ్రత్త పడండి. మీ చిన్నారి వెల్లకీలా పడుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. ఒక వేళ మీ చిన్నారికి పిల్లో కొనాలని మీరనుకుంటే వారికి 2 లేదా మూడేళ్ళు వచ్చేవరకు వేచి చూడండి. ఫ్లాట్ గా టైట్ గా నున్న పిల్లోనే ఎంచుకోవాలి. ఒకే పొజిషన్ లో మీ చిన్నారి ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటే మీరు కచ్చితంగా మీ చిన్నారి పొజిషన్ ను మార్చాలి. లేకపోతే ఒకే వైపు ఒత్తిడి ఎక్కువై నొప్పి కలుగుతుంది.
మీ చిన్నారి నిద్రపోతున్నప్పుడు, తనకి ఊపిరి ఆడకుండా ఇబ్బంది కలిగించేలా బొమ్మలు అడ్డంగా ఉక్కిరిబిక్కిరి కలిగించే బొమ్మలు లేకుండా చూసుకోండి. చిన్నారికి నిద్రలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదురుకోవడం తెలియదు. మీరే గమనిస్తూ మీ చిన్నారి హాయిగా నిద్రపోయేలా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ చిన్నారికి పిల్లో వాడడం సురక్షితమేనా? కాదు.

ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్
ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ అనేది చిన్నారులకు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మీ చిన్నారి ఒకే పొజిషన్ లో మెత్తనైన దిండుపై ఎక్కువ సేపు నిద్రపోతే కొన్ని రకాల స్ట్రక్చరల్ డీఫార్మాలిటీస్ ఏర్పడతాయి. కాబట్టి, చిన్నారికి పిల్లోని వాడడం మంచిది కాదు.

ఉక్కిరిబిక్కిరి కావచ్చు
న్యూ బర్న్ బేబీకి పిల్లో అవసరమా? మనలో చాలా మంది పిల్లో ఉంటే హాయిగా నిద్రపోతారు. అయితే ఈ విషయం చిన్నారికి వర్తించదు. చిన్నారికి పిల్లో వాడితే వారు ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉండొచ్చు. మీ బేబీ సౌకర్యవంతంగా తన తలను అటూ ఇటూ తిప్పలేదు. ఫ్రీ మూవ్ మెంట్ ని పిల్లో అడ్డుకుంటుంది. పిల్లోలో వాడే పదార్థాలు చిన్నారి కంఫర్ట్ లెవల్స్ పై దుష్ప్రభావం చూపిస్తాయి.

బెణుకులు కలగవచ్చు
మీ చిన్నారి ఎక్కువ సేపు పిల్లోపై పడుకుని ఉంటే మెడ బెణికట్టే అవకాశాలు ఎక్కువ. సౌకర్యవంతంగా డిజైన్ చేసిన పిల్లో వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. దురదృష్టవశాత్తు, బేబీ పిల్లోస్ చాలా మటుకు సరిగ్గా డిజైన్ చేసినవి కావు. వీటిని దృష్టిలో పెట్టుకుని చిన్నారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.
టెంపరేచర్ సమస్యలు
చిన్నారికి పిల్లో అవసరమా? పాలిస్టర్ వంటి పదార్థాలతో పిల్లోని తయారు చేసినట్లయితే అటువంటి పిల్లోలను వాడడం మంచిది కాదు. అవి చిన్నారి తలలోని ఉష్ణోగ్రతలు పెంచుతాయి. కొన్ని పదార్థాలు విపరీతమైన చెమటను కలిగిస్తాయి. కాబట్టి, చిన్నారి నిద్రపోయినప్పుడు తనకి శ్వాస ఇబ్బంది కలగకుండా ఆడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. పిల్లో వల్ల చిన్నారి ఇబ్బందులకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లో వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా కాటన్ పిల్లోకే ప్రెఫరెన్స్ ఇవ్వండి.



Click it and Unblock the Notifications