Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్టలో బేబీ గురించి ఎట్రాక్టివ్ ఫ్యాక్ట్స్ ?
ప్రెగ్నెన్సీ అనేది చాలా అద్భుతమైన అనుభూతి. అలాగే.. చాలా భయంకరమైన, కంగారుపెట్టే సమయం కూడా. ఎందుకంటే.. ప్రెగ్నెన్సీ తల్లిదండ్రుల జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. జీవితంలో కొత్త అనుభవాలు తీసుకొస్తుంది. అయితే ఈ సమయం అమ్మకాబోయే అమ్మాయిలో మధుర మనోభావాలు గుర్తుండిపోయేలా చేస్తుంది. ప్రెగ్నెన్సీ గురించి కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. అవేంటో చూసేద్దామా...

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
తన తల్లి ఏం తిన్నా పొట్టలో ఉన్న బేబీ కూడా టేస్ట్ చూస్తాడని మీకు తెలుసా ? నిజమే.. మీరు తినే ప్రతి ఆహారం కడుపులో బేబీకి అందుతుంది. దాని రుచిని కూడా గ్రహిస్తుంది.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
ఇంకా అమ్మ పుట్టలో సురక్షితంగా ఉండే బుజ్జి పాపాయి అన్ని గ్రహించగలదు. పుట్టని పసికందు కడుపులో ఉన్నప్పటికీ.. స్పర్శ, చూపు, శబ్ధం గ్రహించగలుగుతుంది.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
గర్భంలో ఉన్న పసికందు 3 నెలల్లోనే ఫింగర్ ప్రింట్స్ పొందగలుగుతుంది.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
అమ్మ పొట్టలో ఉండే బిడ్డకు చివరగా డెవలప్ అయ్యే అవయవం ఏదో తెలుసా ? ఊపిరితిత్తులు. ఇవే అన్నింటికంటే చివరగా ఏర్పడే అవయవం.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ గర్భం సాధారణ పరిమాణం కంటే.. 500 రెట్లు కంటే ఎక్కువ పెద్దగా సాగుతుంది.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
కడుపులో నుంచి భూమ్మీదకు రాగానే బుజ్జి పాపాయి ఏడుస్తుంది. ఇదే మొదటి సారి అని చాలా మంది అనుకుంటారు. కానీ.. గర్భంలో ఏడుస్తారట.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
మీకు తెలుసా ? సెకండ్ ట్రైమ్ స్టర్ అంటే మొదటి మూడు నెలల తర్వాత నుంచి పిల్లలు గర్భాశయంలో మూత్రం చేస్తారు. మళ్లీ తాగుతారు కూడా.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
కడుపులో ఉన్న బిడ్డ ఆడా ? మగా ? అని తండ్రి క్రోమోజోమ్ ద్వారా తెలుస్తుంది. అమ్మ ద్వారా కాదు.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
మనుషుల శరీరంలో అతి పెద్ద కణం ఆడవాళ్ల అండం లేదా గుడ్డు. అదే అతి చిన్న కణం.. మగవాళ్ల స్పెర్మ్.

ప్రెగ్నెన్సీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు
కుందేలు, గొరిళ్లా, కుక్క, పంది, వేల్ ఫిష్ ఇలా వీటన్నింటి ఎగ్ సైజ్, మనుషుల ఎగ్ సైజ్ ఒకటే.



Click it and Unblock the Notifications