For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: వన్ ఇయర్ లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు ? ఎందుకు ?

By Swathi
|

సాధారణంగా పుట్టిన పిల్లలకు తల్లిపాలు పడతారు. ఒకవేళ తల్లిపాలు సరిపోనప్పుడు పాలపౌడర్ ఉపయోగిస్తారు. అయితే పాలపౌడర్ ని కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో పాలు పెడతారు. అంటే ఆవు పాలు, లేదా గేదె పాలు పడతారు. చాలా మంది ఆవు పాలు శ్రేష్టమని భావిస్తారు. కానీ ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు మంచిది కాదని స్టడీస్ చెబుతున్నాయి.

మరికొందరైతే.. తల్లిపాలకంటే కూడా ఆవుపాలే శ్రేష్టమని భావిస్తారు. కానీ ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు ఏమాత్రం సేఫ్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆవు పాలల్లో క్యాల్షియం, ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కనీసం ఏడాది పాటు ఆవుపాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఆవుపాలు పిల్లలకు ఇవ్వకూడదు అనడానికి 10 కారణాలు చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..

ఎంజైమ్స్

ఎంజైమ్స్

ఆవు పాలల్లో ఎక్కువ ఎంజైమ్స్ ఉంటాయి. అవి బేబీ ఆరోగ్యానికి అనుకూలమైనవి కాదు. అంతేకాదు ఇంకా పూర్తీగా అభివృద్ధి కానీ.. జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపి.. జీర్ణక్రియ సరిగా కాకుండా అడ్డుపడాయి.

డైజెషన్

డైజెషన్

ఆవు పాలల్లో లాక్టోజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అది బేబీ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

ఐరన్

ఐరన్

ఆవు పాలల్లో ఐరన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా పాల ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. కానీ.. ఆవు పాలు ఇవ్వడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడి.. అనీమియాకు దారితీస్తుంది.

ఒబెసిటీ

ఒబెసిటీ

ఆవు పాలలో ప్రొటీన్స్ రిచ్ గా ఉంటాయి. వీటిని ఏడాది లోపు పిల్లలకు ఇవ్వడం వల్ల భవిష్యత్ లో ఒబేసిటీ, ఫ్యాట్ కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

బ్లడ్ లాస్

బ్లడ్ లాస్

రెగ్యులర్ గా చిన్న పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల ఇంటెస్టినల్ లో బ్లడ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది రానురాను ఐరన్ కోల్పోవడానికి కారణమవుతుంది.

క్యాల్షియం

క్యాల్షియం

ఆవు పాలలో ఎక్కువగా క్యాల్షియంతో పాటు ప్రొటీన్ ఉండటం వల్ల ఐరన్ గ్రహించే తత్వాన్ని కోల్పోతారు. దీనివల్ల బేబీకి ఫ్యూచర్ లో అనీమియా ప్రమాదం ఉంటుంది.

కిడ్నీ

కిడ్నీ

ఆవు పాలు చిన్న పిల్లల పొట్టకు అనుకూలమైనవి కావు. దీనివల్ల టాక్సిన్స్ ని బయటకు పంపడానికి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఆవు పాలు ఇవ్వడం వల్ల లూజ్ మోషన్స్, డయేరియా అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల.. బేబీ డీహైడ్రేటెడ్ అవుతారు.

నిద్రకు ఆటంకం

నిద్రకు ఆటంకం

కొంత మంది పిల్లల్లో ఆవు పాలు అలర్జీకి కారణమవుతాయి. దీనివల్ల నిద్రకు ఆటంకం కలగడం, నిద్రపోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పొట్ట నొప్పి

పొట్ట నొప్పి

చిన్నపిల్లల్లో పొట్ట నొప్పికి ఆవు పాలు కూడా కారణమవుతాయి. ఇవి తేలికగా జీర్ణమవవు కాబట్టి.. బ్లోటింగ్, పొట్ట నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చిట్కా

చిట్కా

ఏడాదిలోపు పిల్లల్లో అవయవాలు పూర్తీగా అభివృద్ధి చెంది ఉండవు. కాబట్టి రెండేళ్ల తర్వాత అయితే చిన్న పిల్లల శరీర అవయవాలన్నీ డెవలప్ అయి ఉంటాయి. అప్పుడు ఆవు పాలు ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వవచ్చు.

English summary

10 reasons giving cow’s milk to your child below one-year of age is a bad idea

10 reasons giving cow’s milk to your child below one-year of age is a bad idea. Here is why you should always opt for breastfeeding or formula feeding over cow's milk till one year of age.
Story first published:Thursday, May 19, 2016, 10:35 [IST]
Desktop Bottom Promotion