Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లి వయసుకి పుట్టబోయే బిడ్డ తెలివికి లింకేంటి ?
ఒకప్పుడు 16 ఏళ్లు కూడా రాకముందే పెళ్లిచేసేవాళ్లు. తర్వాత ప్రభుత్వం చొరవతో.. 18 ఏళ్ల తర్వాతే పెళ్లి చేయాలనే నిబంధన వచ్చింది. అంతేకాదు 30 ఏళ్లలోపే పిల్లలను ప్లాన్ చేసుకోవాలని.. రకరకాలుగా అవగాహన కల్పించారు. 30 ఏళ్లు దాటితే.. పిల్లలు పుట్టేది కష్టమని, ఒకవేళ పుట్టినా.. పిల్లలకు లోపం ఉంటుందని హెచ్చరించే వాళ్లు. కానీ ఇప్పుడు 30 దాటితేనే పిల్లలు కనడానికి సరైన సమయం అంటున్నారు ? ఎందుకు ? 30 నుంచి 39 ఏళ్ల మధ్య పిల్లలను కనాలనే కొత్త అధ్యయనం చెబుతున్న సంకేతాలేంటి ?
పొట్టలో బేబీ గురించి ఎట్రాక్టివ్ ఫ్యాక్ట్స్ ?

తల్లి వయసు, పిల్లల తెలివితేటల విషయంలో ప్రాముఖ్యత వహిస్తుందా ? అంటే బ్రిటీష్ అధ్యయనాల ప్రకారం నిజమే అని తేలింది. 18 వేల మంది పిల్లల డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనాల్లో చాలా ఆసక్తికర, ఆశ్చర్యకర విషయం బయటపడింది. మొదటి బిడ్డ 30 లలో పుడితే.. చాలా తెలివితేటలు కలిగిన బిడ్డ జన్మిస్తారని ఈ స్టడీస్ చెబుతున్నాయి.
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
తల్లి వయసు 20లలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లల కంటే.. 30లలో ఉన్న తల్లికి పుట్టిన బిడ్డ ఎక్కువ స్మార్ట్ గా ఉంటారని ఈ స్టడీస్ చెబుతున్నాయి. ఇందుకు ఉదాహరణ కూడా చెబుతోంది ఈ అధ్యయనం. 30 ఏళ్లలో ఉన్న మహిళ చాలా ఎడ్యుకేటెడ్, ఎక్కువ ఆదాయం, మంచి రిలేషన్ షిప్ కలిగి ఉంటుందని అలాగే హెల్తీ లైఫ్ స్టైల్, ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ కేర్ తీసుకోవడం, చాలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించగలుగుతారు కాబట్టి వాళ్లకు పుట్టే బిడ్డ చాలా తెలివిగా ఉంటారని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

అదే.. నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలను కంటే.. వాళ్లు అంత తెలివైన వారిలా ఉండరని కూడా ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. కాబట్టి మరీ లేటు వద్దు.. మరీ తొందరా వద్దు. మహిళలకు సరైన సమయం 30 దాటిన తర్వాతే అని ఈ స్టడీస్ చెబుతున్నాయి. అయితే పిల్లల తెలివితేటలు చదువుకునే విధానం, వాళ్లను చేర్పించిన స్కూలు, తల్లిదండ్రుల ఆలోచనా శక్తిపై ఆధారపడి ఉంటుందని.. ఇలా వయసుతో సంబంధం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.



Click it and Unblock the Notifications