For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు రాత్రంతా నిద్రపోకపోవడానికి ఆశ్చర్యకర కారణాలు..!

కొంతమంది రాత్రిళ్లు పడే ఇబ్బంది.. నిద్రలేకపోవడం. మొదట్లో అప్పుడే పుట్టిన పిల్లలు రోజంతా నిద్రపోయి.. రాత్రిపూట నిద్రలేస్తారు. ఇది సాధారణం, ఆరోగ్యకరం కూడా.

By Swathi
|

పేరెంటింగ్ బాధ్యతలు చాలా అందంగా ఉంటాయి. కానీ వాళ్ల సంరక్షణ చూసుకోవడం చాలా కష్టమైన పని. బేబీ పెరిగి పెద్దవాళ్లు అయ్యేకొద్దీ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అనుభవం ఎదురవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎక్స్ పీరియన్స్ ఎదురవుతుంది.

baby sleep

కొంతమంది రాత్రిళ్లు పడే ఇబ్బంది.. నిద్రలేకపోవడం. మొదట్లో అప్పుడే పుట్టిన పిల్లలు రోజంతా నిద్రపోయి.. రాత్రిపూట నిద్రలేస్తారు. ఇది సాధారణం, ఆరోగ్యకరం కూడా. కానీ వాళ్లు పెరిగేకొద్దీ.. వాళ్లు నిద్రపోయే విధానంలో మార్పు వస్తుంది. రాత్రంతా నిద్రపోవడం నేర్చుకుంటారు.

అయితే పిల్లలు మొదట్లో రాత్రిళ్లు పూర్తీగా నిద్రపోరు. మధ్యలో నిద్రలేస్తూ ఉంటారు. కొన్ని నెలలు, కొన్ని వారాలపాటు పిల్లలు సరిగా పూర్తీగా రాత్రంతా నిద్రపోరు. దీనివల్ల కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కానీ.. వాళ్లు రాత్రంతా ఎందుకు నిద్రపోరో తెలుసుకోవాలి.

ఆకలి, దప్పిక

ఆకలి, దప్పిక

కొంతమంది పిల్లలు రాత్రిళ్లు నిద్రలేవడానికి ఆకలి కారణం అయి ఉండవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలు అయినా.. బాటిల్ పాలు తాగే పిల్లలు అయినా.. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నిద్రలేస్తారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పాలుపట్టాలి.

నిద్ర అవసరం

నిద్ర అవసరం

కొంతమంది పిల్లలకు స్లీప్ ప్రాప్ ద్వారా నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల కూడా నిద్రపోలేరు. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్లు డీప్ స్లీప్, లైట్ స్లీప్ వంటి అలవాట్లు అలవాటు అవుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి.. నిద్రలేస్తారు. బాటిల్ ఫీడింగ్ ద్వారా నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్లు వాళ్లంతటవాళ్లు నిద్రపోలేరు.

చాలా అలసిపోయినప్పుడు

చాలా అలసిపోయినప్పుడు

పెద్దవాళ్లు బాగా అలసిపోయినప్పుడు నిద్రపోవడానికి ఎలా ఇబ్బందిపడతారో.. పిల్లలు కూడా.. చాలా అలసిపోయినప్పుడు.. నిద్రపోలేరు. బాగా అలసిపోయినప్పుడు తక్కువ నిద్రపోతారు. ఎక్కువగా నిద్రలేస్తూ ఉంటారు.

అనారోగ్యం

అనారోగ్యం

రాత్రిళ్లు చాలా తరచుగా నిద్రలేవడానికి వాళ్ల ఆరోగ్య సమస్యలు కూడా కారణం అయి ఉండవచ్చు. పొట్టనొప్పి, గ్యాస్, జలుబు, దగ్గు, పళ్లు వస్తున్నప్పుడు ఇబ్బంది వంటి కారణాల వల్ల కూడా రాత్రిళ్లు పూర్తీగా నిద్రపోలేరు.

మీకు దగ్గర కావాలని

మీకు దగ్గర కావాలని

6 నుంచి 8 నెలల మధ్యలో పిల్లల్లో సెపరేషన్ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. 5ఏళ్ల వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ఈ ఏజ్ లో మీ బేబీ రాత్రిళ్లు చాలాసార్లు నిద్రలేవడం చూసే ఉంటారు. మళ్లీ నిద్రపోవడం ఇష్టం లేక ఏడుస్తూ ఉంటారు. మెలకువ రాగానే చుట్టూ మీరు ఉన్నారో లేదో అని గమనిస్తూ ఉంటారు. మీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు.

 వాతావరణం

వాతావరణం

మీ బేబీ విభిన్నవాతావరణంలో నిద్రలేచారంటే.. చాలా అయోమయానికి గురై.. మళ్లీ నిద్రపోవడానికి ఇబ్బందిపడతారు. కాబట్టి మీ బేబీ ఎక్కడైతే రాత్రంతా హాయిగా నిద్రపోతారో.. అక్కడే నిద్రపెట్టడం మంచిది. కొన్నిసార్లు టెంపరేచర్ లో మార్పులు పిల్లల నిద్రపై ప్రభావం చూపుతాయి.

పగలు నిద్రపోకపోవడం

పగలు నిద్రపోకపోవడం

పిల్లల పెరుగుదలకు, ఎదుగుదలకు మధ్యాహ్నం నిద్ర చాలా అవసరం. పగలు నిద్రపోకపోతే.. చాలా అలసిపోయి.. రాత్రిపూట.. సరిగా నిద్రపోలేకపోతారు. కానీ.. సరైన సమయంలో మధ్యాహ్నం పడుకోపెట్టడం అవసరం. మధ్యాహ్నం లేటుగా నిద్రపోతే.. రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది అవుతుంది.

డెవలప్ మెంటల్ స్కిల్స్

డెవలప్ మెంటల్ స్కిల్స్

ఒకవేళ మీ బేబీ తన్నడం, దొర్లడం, కూర్చోవడం, నిలబడటం వంటి స్కిల్స్ నేర్చుకున్నారంటే.. నిద్రలో కూడా అది ట్రై చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. దీనివల్ల రాత్రిపూట... మధ్యలో నిద్రలేస్తారు.

సన్ లైట్ అందకపోతే

సన్ లైట్ అందకపోతే

పిల్లలు హాయిగా, హ్యాపీగా నిద్రపోవడానికి సన్ లైట్, ఫ్రెష్ ఎయిర్ చాలా అవసరం. 6 నుంచి 12 నెలల పిల్లలు.. మధ్యాహ్నం పూట ఎక్కువ సన్ లైట్ పొందితే.. రాత్రిపూట హాయిగా నిద్రపోతారట. కాబట్టి మీ బేబీపై ఉదయం, మధ్యాహ్నం ఎండపడేలా జాగ్రత్తపడండి.

English summary

9 Common Reasons Why Babies Don’t Sleep Through the Night

10 Common Reasons Why Babies Don’t Sleep Through the Night. As they start growing, their sleep pattern changes and they learn to sleep through the night.
Story first published: Tuesday, November 15, 2016, 10:29 [IST]
Desktop Bottom Promotion