Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఎదిగే పిల్లలకు బహు ప్రయోజనాలందించే అమృతం నెయ్యి...
ముందుకాలం చాలా మందికి నేతి చుక్క కలవనిదే ముద్ద గొంతులో దిగేది కాదు. ముందు కాలంలో పల్లెటూర్లలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసమనే ఒక ఆవును ఇల్లుల్లో తెచ్చిపెట్టుకొనేవారు. దాని కావలసిన అన్ని సదుపాయాలనందిస్తూ వాటి ద్వారా ఎన్నో లాభాలను పొందేవారు. నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. నెయ్యిని వంటకాలు తయారీలో గాని, నేరుగా గాని వాడవచ్చు. శరీరములోని ప్రతిష్టాయిలోని టిస్స్యు లకు బలాని చేకూర్చుతుంది.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతము చేస్తుంది . రోజుకు 2 - 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా హోర్మోనైజ్ అవుతుంది. నెయ్యిలో సాచ్యురేటెడ్ ఫాట్స్ ఉన్నందున కొలెస్టిరాల్ ని తగ్గిస్తుంది. నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది.
పెద్దలకు సరే మరి పిల్లలకు నెయ్యి పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరతాయి?రెగ్యులర్ డైట్ లో పిల్లలకు పాలలాగే మరికొన్ని న్యూట్రీసియన్ ఫుడ్స్ అవసరం అవుతాయి. అలాంటి వాటిలో నెయ్యి ఒకటి. అందుకే కొంత మంది చిన్న పిల్లల డాక్టర్లు పిల్లకు సెమి సాలిడ్ ఫుడ్స్, ఐరన్, ప్రోటీన్ మరియు విటమిన్ ఫుడ్స్ అందివ్వమని సలహాలిస్తుంటారు . ఈ న్యూట్రీషియన్స్ , ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని నెయ్యిలో పుష్లకంగా ఉన్నాయి. పిల్లలకు అందివ్వడం ద్వారా వారిలో చాలా తేలికగా జీర్ణించుకోగలుగుతారు , 6 నెలల శిశువు నుండి కూడా నెయ్యి పౌష్టికాహారంగా అందివ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చూస్తున్నారు.

చిన్న పిల్లలకు అందించే ఆహారాల్లో నెయ్యి హైలీ న్యూట్రీషియన్ ఫుడ్ . ఇందులో ఫ్యాట్ ఎక్కువ. కాబట్టి కొంత పరిమితిలో మాత్రమే ఇవ్వాలి . మితంగా పెట్టడం వల్ల బేబీలో న్యూట్రీషియన్స్ సమతుల్యం అవుతాయి. బేబీ గ్రోత్ రేటు బాగుంటుంది. నెయ్యిని బేబీలకు పెట్టడం ద్వారా ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందాం...
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నెయ్యిలో శ్యాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్ చాలా సులభంగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. చిన్నపిల్లలు రెడ్ మీట్ మిరయు ఇతర ఫ్యాట్ ఫుడ్స్ ను జీర్ణం చేసుకోవడానికి కష్టం అవుతుంది.కాబట్టి, ఫ్యాట్ ఫుడ్స్ నుండి పొందే క్యాలరీలను నెయ్యినుండి బేబీస్ పొందుతారు . దాంతో వారు రోజంతా ఎనర్జిటిక్ గా కనబడుతారు.

ల్యాక్టోజ్ ఫ్రెండ్లీ: నెయ్యి డైరీఫ్రొడక్ట్ అయినా కూడా.. ల్యాక్టోజ్ షుగర్స్ ను విచ్ఛిన్నం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి ల్యాక్టోజ్ లోపం ఉన్న బేబీస్ కి నెయ్యిని రెగ్యులర్ గా అందివ్వడం చాలా మంచిది.
విటమిన్స్ అధికం: నెయ్యిలో విటమిన్ A, D, K and E లు పుష్కలంగా ఉన్నాయి . ఈ విటమిన్స్ బేబీలో హెల్తీ బోన్స్ మరియు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతాయి. మరియు ఇది బేబీలో వ్యాధినిరోధకత పెంచడంలో మరియు వ్యాధులను ఎదుర్కోవడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హెల్తీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కోసం : బేబీస్ కు అందించే రెగ్యులర్ డైట్ లో నెయ్యి చేర్చడం వల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్ మెంట్ ప్రొసెస్ కూడా వేగంగా జరుగుతుంది . నెయ్యిలో DHA and EPA, తో పాటు విటమిన్స్ అధికంగా ఉండి, బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతాయి.
బరువు పెరగడానికి సహాయపడుతుంది: పిల్లల ఎదుగుదలకు మదర్స్ మిల్క్ లోని ఫ్యాట్ మంచి మూలం. అయితే బేబీ 8నెలల్లో అడుగుపెట్టగానే మరింత ఎక్సట్రా ఎనర్జీ మరియు క్యాలరీస్ అవసరం అవుతుంది . కాబట్టి నెయ్యి అందివ్వడం వల్ల వారి శరీరానికి అవసరం అయ్యే క్యాలరీలను అందించవచ్చు. దాంతో వారు క్రమంగా బరువు పెరుగుతారు.



Click it and Unblock the Notifications
