For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు రోజుకి ఒక టీస్పూన్ బొప్పాయి తినిపిస్తే కలిగే బెన్ఫిట్స్..!

రెగ్యులర్ గా బేబీకి ఒక టీస్పూన్ బొప్పాయి తినిపించడం వల్ల కలిగే బెన్ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే.. టీస్పూన్ తో మొదలుపెట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు.. క్వాంటిటీని పెంచుతూ రావచ్చు.

By Swathi
|

మీ పిల్లలు సాలిడ్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టిన తర్వాత పండ్లు, కూరగాయలను కంపల్సరీ పెట్టాలి. బేబీకి ఏడాది దాటిన తర్వాత బాగా పండిన బొప్పాయిని కొద్ది కొద్ది మోతాదులో పెట్టవచ్చు. అయితే.. బొప్పాయి తినడం వల్ల బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగడం లేదని గమనించాలి.

How Papaya Benefits Your Baby

ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ని గమనించినట్టైతే.. వెంటనే బొప్పాయి తినిపించడం మానేయాలి. బేబీకి బొప్పాయి తినిపించడానికి ముందు ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది. అలాగే కేవలం ఒక టీస్పూన్ బాగా పండిన బొప్పాయి మాత్రమే.. మొదట్లో బేబీకి తినిపించాలి.

అయితే రెగ్యులర్ గా బేబీకి ఒక టీస్పూన్ బొప్పాయి తినిపించడం వల్ల కలిగే బెన్ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే.. టీస్పూన్ తో మొదలుపెట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు.. క్వాంటిటీని పెంచుతూ రావచ్చు.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

కొద్ది మోతాదులో బొప్పాయిని పిల్లల డైట్ లో చేర్చడం వల్ల వాళ్లకు కావాల్సిన ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణక్రియ చాలా వేగంగా, తేలికగా జరుగుతుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది పిల్లలలో ఇమ్యునిటినీ మెరుగుపరిచి.. స్ట్రాంగ్ గా మారుస్తుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.

ర్యాషెస్

ర్యాషెస్

బొప్పాయిని చర్మానికి పట్టించడం వల్ల ఎలాంటి ర్యాషెస్ నైనా తేలికగా నివారిస్తుంది. అల్సర్లు, వాపు, మంట, కాలిన గాయలను అరికడుతుంది. ఒకవేళ మీ బేబీలో స్కిన్ ర్యాషెస్ సమస్య ఉంటే.. బొప్పాయి పేస్ట్ ని అప్లై చేసి చూడండి.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల.. కోలన్, జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని వ్యాధులను అడ్డుకుంటుంది.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ఒకవేళ మీ బేబీలో కాన్ట్సిపేషన్ సమస్య ఉంటే.. ఒక టీస్పూన్ బొప్పాయి పేస్ట్ ని రోజుకి రెండుసార్లు తినిపించాలి. ఇందులో ఉండే లాక్సేటివ్ కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది.

 పేగులలో పురుగులు

పేగులలో పురుగులు

ఏడాది దాచిన పిల్లల పేగులలో నులి పురుగుల సమస్యను బొప్పాయితో నివారించవచ్చు. ఒక టీస్పూన్ బొప్పాయి విత్తనాల పౌడర్ ని తేనెలో కలిపి రెండు రోజులపాటు ఇవ్వడం వల్ల.. పేగులలో నులి పరుగులను నివారించవచ్చు.

English summary

How Papaya Benefits Your Baby

How Papaya Benefits Your Baby. Mashed ripe papaya can be offered to babies who are above the age of 18 months. Here are some benefits of papaya for babies.
Story first published: Tuesday, December 13, 2016, 9:53 [IST]
Desktop Bottom Promotion