For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు పుట్టబోయే బిడ్డ స్మార్ట్ గా, యాక్టివ్ గా ఉండటానికి సింపుల్ టిప్ !

By Swathi
|

మీరు క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంక్ సాధించినప్పుడు, చదువు అయిపోగానే ఉద్యోగం సంపాదించినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి మురిసిపోయి ఉంటారు కదా. అలాంటి విషయాలు ఎప్పటికీ మరచిపోలేనివి. పిల్లల సక్సెస్ చూసినప్పుడు పేరెంట్స్ చాలా గర్వంగా ఫీలవుతారు. అలాగే పిల్లల స్కిల్స్ పెరగడానికి తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటారు.

ప్రతి ఒక్కరి తల్లిందండ్రులు తమ పిల్లలు స్మార్ట్ గా, తెలివిగా ఉండాలని కోరుకుంటారు. హెల్తీగా, యాక్టివ్ గా ఉండాలని ఆశిస్తారు. వాళ్ల తెలివితేటలు పెరగడానికి చాలా సహాయపడతారు. అప్పుడే వాళ్లు జీవితంలో సక్సెస్ అవుతారని నమ్ముతారు. అందుకే డ్యాన్స్, మ్యూజిక్ వంటి రకరకాల క్లాస్ లకు పంపిస్తారు. అయితే బ్రెయిన్ ఫంక్షన్స్ తల్లి కడుపులో ఉండగానే మొదలవుతాయని మీకు తెలుసా ?

Try This Pregnancy Tip To Make Your Baby Smarter

అవును కడుపులో శిశువుగా ఉన్నప్పుడే మెదడు పనితీరు మొదలవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయం నుంచే బిడ్డను స్మార్ట్ గా తయారు చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్స్, మినరల్స్ ఉండే పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ హెల్తీగా ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్రూట్స్ బాగా తీసుకుంటే.. పిల్లలు చాలా తెలివిగా పుడతారని తాజా అధ్యయనం తేల్చింది.

Try This Pregnancy Tip To Make Your Baby Smarter

688 మంచి పిల్లల ఐక్యూపై స్టడీ చేశారు. రోజుకి 6 ఫ్రూట్స్ లేదా 6 రకాల ఫ్రూట్ జ్యూస్ లు తాగిన తల్లులకు పుట్టిన పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ ఫ్రూట్స్ తినని తల్లులకు పుట్టిన పిల్లలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని ఈ స్టడీస్ లో వెల్లడించారు. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకునే తల్లుల తెలివితేటలను బేబీకి 12 నెలల వయసులో గుర్తించవచ్చట.

Try This Pregnancy Tip To Make Your Baby Smarter

ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ లలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కడుపులోని శిశువు బ్రెయిన్ సెల్స్ కి పోషణను అందిస్తాయి. దీనివల్ల బేబీ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కొత్త విషయాలను తేలికగా, వెంటనే నేర్చుకుంటారు. అలాగే కడుపులో ఉండగానే మెమరీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో.. కనీసం రోజుకి 4 నుంచి 5 పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Try This Pregnancy Tip To Make Your Baby Smarter!

Try This Pregnancy Tip To Make Your Baby Smarter! Did you know that the brain functions of a child start to develop when the infant is in the mother's womb?
Story first published:Tuesday, May 31, 2016, 14:42 [IST]
Desktop Bottom Promotion