For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి పాలు తాగే చంటి పిల్లల్లో వచ్చే పొట్ట(కోలిక్)నొప్పికి సహజ చిట్కాలు

పాలు తాగే చంటి పిల్లల్లో వచ్చే పొట్ట నొప్పికి సహజ చిట్కాలు

|

చంటిపిల్లల జీవితంలో కోలిక్ నొప్పి ఒక వింతైన రహస్యం. కోలిక్ లేదా తీవ్రంగా వచ్చే నొప్పి అంటే సడెన్ గా ఆగుతూ,వస్తూ ఉండే నొప్పి అని అర్థం. లోపల ఉన్న పదార్థాలను (పెద్దపేగు, మూత్రాశయం మొ.వాటిల్లో) బయటకు తోసేయటానికి, ఏమన్నా అడ్డు ఉంటే తొలగించటానికి జరిగే కండరాల సంకోచ వ్యాకోచాల వలన నొప్పి ఆగి, వస్తూ ఉంటుంది. ఇది వాంతులు, చెమటలు తీవ్రంగా పట్టడంతో కలిపి కూడా జరగవచ్చు. ఇది చాలా రకాలు.

చంటిబిడ్డలలో వచ్చే కోలిక్, దీర్ఘకాల సమస్యలేమీ తీసుకురాదు. ఇది చాలామంది పిల్లలలో సహజమే. ముఖ్యంగా బిడ్డ మూడవ నెల నుంచి 6నెలల వయస్సు మధ్యలో దీన్ని చూడవచ్చు. కాకపోతే చంటిబిడ్డలు కడుపులో తీవ్రంగా గుచ్చుతున్న నొప్పి వలన అదే పనిగా గంటల కొద్దీ ( మూడు గంటల కన్నా ఎక్కువగా) ఏడుస్తుండటంతో, వారి చుట్టూ అందరూ కంగారుపడతారు. ఆందోళన చెందకుండా దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే, సరైన పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు.

<strong>మీ పసిబిడ్డకి ఏం తినిపించటం శ్రేయస్కరం?</strong>మీ పసిబిడ్డకి ఏం తినిపించటం శ్రేయస్కరం?

దీని లక్షణాలు :

• బిడ్డ సాధారణంగా రోజులో మూడు గంటలకి మించి, వారంలో మూడుసార్ల కన్నా ఎక్కువ అలా ఏడుస్తూ ఉండటం.

• ఎక్కువగా మధ్యాహ్నం చివర్లో మరియు సాయంకాల సమయాల్లో ఏడవడం

• కడుపు ఉబ్బరించినట్లు లేదా వాచినట్లు ఉండటం

• జ్వరం

• మెల్లగా కదులుతుండటం

• కాళ్ళను పొట్టపై అదేపనిగా మడిచి పెట్టుకోవడం

• ఎర్రబడిన మొహం

• పిడికిలి బిగించి ఉంచటం

• ముడతలుగా కన్పించే నుదురు

• కళ్ళు గట్టిగా మూసేసుకోవటం

• మెలికలు తిరిగే కడుపునొప్పి

• వాంతులు

• ఏడుస్తున్నప్పుడు వీపును విల్లులా వెనక్కి వంచడం

• సాధారణం కన్నా తక్కువ న్యాపీలనే మార్చాల్సి రావటం

• తల్లిపాలు తాగుతున్నప్పుడు ఏడుస్తూ పక్కకి తిరిగిపోవటం

పైన తెలిపిన అన్నీ లేదా కొన్ని లక్షణాలు తప్పక మీ బిడ్డలో ఈ కోలిక్ కడుపు నొప్పి కలిగినప్పుడు చూడవచ్చు. ముఖ్యంగా మాత్రం ప్రతిరోజూ సాయంత్రం ఒకే సమయానికి ఆపకుండా ఏడుస్తున్నట్లయితే ఇదే అని అనుమానించవచ్చు.

<strong>శిశువు సంరక్షణలో కొన్ని కట్టుకథలు</strong>శిశువు సంరక్షణలో కొన్ని కట్టుకథలు

పిల్లల్లో ఈ నొప్పిని ఏవి కలిగిస్తాయి?

ఈ తీక్షణ కడుపులో నొప్పి(కోలిక్) కి కారణాలు ఇంకా సరిగా తెలియవు. ఆవుపాలు తాగిన చంటిపిల్లల్లో బొవైన్ ప్రొటీన్ కి యాంటీబాడీ చర్య జరగటం వలన కోలిక్ రావచ్చు. కానీ అధ్యయనాల ప్రకారం ఇది ఇంకా ధృవీకరించబడలేదు. చాలాకాలం పాటు నమ్మిన కడుపులో గ్యాస్ సమస్య వలన కోలిక్ నొప్పి వస్తుందనే వాదన కూడా తప్పని తేలింది.

కొందరి వాదన ప్రకారం కడుపులో ఆహారనాళం అతిగా సంకోచించి వ్యాకోచించటం వలన కూడా ఈ నొప్పి తగ్గుతూ పెరుగుతూ ఉండవచ్చని అంటారు.

మానసిక రుగ్మతలు మరియు సామాజిక కారణాలు కూడా ఈ నొప్పికి ఎక్కడో లింక్ కావచ్చని అనుకున్నారు కానీ అది కూడా నిరూపణ కాలేదు. తల్లిదండ్రులలో ఉండే మానసిక ఆందోళన వలన పిల్లలకి అదే వస్తుందనే విషయం రుజువు కాలేదు. పొగ తాగేవారి వల్ల వారి పిల్లల్లో ఇది వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువే ఉంది. తల్లిపాలు, సీసాపాల మధ్య తేడా వల్ల ఈ నొప్పి రావచ్చని నిర్ధారణ కాలేదు. త్రేపులకి దీనికి సంబంధం లేదు.

బిడ్డ జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా ఎదగనందున, తాగిన పాలు జీర్ణమవటానికి తగిన ఎంజైములు కూడా లేక ఈ నొప్పి రావచ్చు. మొదటి నెల వయస్సు దాటగానే పిల్లల్లో అన్ని జ్ఞానేంద్రియాలు చాలా చురుకుగా పనిచేయటం మొదలుపెడతాయి. అందుకని తమ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రతి మార్పుకి (కాంతి, శబ్దాలు వంటివాటికి) సున్నితంగా స్పందిస్తారు. అందుకని దేనికైనా త్వరగా ఏడుపు మొదలుపెట్టేస్తారు. ఇంకా ఎదుగుతున్న నాడీవ్యవస్థ కూడా ఈ మూడ్ మార్పులకి కారణం.

ఇంటి సహజ చిట్కాలు

1.చామంతి టీ

1.చామంతి టీ

చామంతి టీ కోలిక్ నొప్పి ఉన్న చంటిబిడ్డలకి మంచి ఉపశమనం ఇస్తుంది. సాధారణంగానే చాలా ఏళ్ళ నుంచి వైద్యరంగంలో మానసిక వత్తిడికి, జీర్ణసమస్యలకి దీన్ని వాడుతూ వస్తున్నారు. ఇది ఎంతో ప్రసిద్ధమైన హెర్బల్ టీ.

ఇందులో మీ బిడ్డకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఎ వంటి విటమిన్లు, ఖనిజలవణాలుంటాయి. దీనికి ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, అలర్జీ వ్యతిరేక, వాపు వ్యతిరేక లక్షణాలు చంటిపిల్లల్లో వచ్చే కోలిక్ నొప్పికి సరిగ్గా పనిచేస్తాయి. మీ బిడ్డ కడుపు ఆరోగ్యానికి, పళ్ళు బాగా రావటానికి, రోగనిరోధక వ్యవస్థ బలానికి, మంచి నిద్రకి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

ఈ సహజగుణాలున్న టీను ఎలాంటి పిల్లలైనా 6 నెలల పాటు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అప్పుడే పుట్టిన పాపాయికి మాత్రం సరైన డోసులో ఇవ్వాలి.

కావాల్సిన వస్తువులు;

చమోమిలే పూల పొడి - అరచెంచా

1 గ్లాసు నీరు- మరిగించటానికి

తయారీ విధానం ;

- ముందుగా గ్లాసు నీరును మరిగించండి.

- ఎండబెట్టిన చామంతి పూలను టీ హోల్డర్ లో వేసి కప్పుపై పెట్టి నీరు పోయండి. ఒక 8 నుంచి 10 నిమిషాల తర్వాత టీ కిందకి దిగుతుంది.

- లేదా ఎండిన చామంతి రేకులను నేరుగానే నీటిలో వేసేయండి. ఒక పదినిమిషాల తర్వాత వడగట్టుకుంటే టీ తయారు.

ఒక చెంచా టీను మీ బిడ్డకి తాగించండి.

2.పెరుగు

2.పెరుగు

ఎక్కువ ప్రోబయాటిక్స్ తీసుకునే పిల్లల్లో కోలిక్ నొప్పి సమస్య తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వాటిల్లో పెరుగు ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఎంతో ప్రసిద్ధి చెందిన పదార్థం.

మీ బిడ్డ రోజుకి ఒక చెంచా పెరుగును 2-3 సార్లు తినటం మంచిది. ఇది తన జీర్ణవ్యవస్థను, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

3.యాపిల్ సిడర్ వెనిగర్

3.యాపిల్ సిడర్ వెనిగర్

మనుషుల జీర్ణవ్యవస్థకి యాపిల్ సిడర్ వెనిగర్ చేసే లాభాలు శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి. ఇది చంటిబిడ్డలకి వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం యాపిల్ సిడర్ వెనిగర్ ఎంత ఆమ్ల గుణాన్ని కలిగివుందని. నేరుగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదకారి కావచ్చు. అందుకని కోలిక్ సమస్య ఉన్న చంటిపిల్లలకి వాడేటప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీటితో కలిపి తాగించండి. (కొన్ని చెంచాల యాపిల్ సిడర్ ను కప్పు నీటిలో కలపండి)

4.ఫెన్నెల్ సీడ్స్ (సోంపు)

4.ఫెన్నెల్ సీడ్స్ (సోంపు)

సోంపు సాధారణంగా అన్నిరకాల కడుపునొప్పిని, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది.

కావాల్సినవి ;

సోంపు - 1 చెంచా

వేడి నీరు - 1 కప్పు

తయారీ; అరచెంచా సోంఫును మెత్తగా చేసి, ఒక కప్పు వేడినీటితో కలపండి.

పదినిమిషాలు అలా వదిలేయండి.

అరచెంచా -1 చెంచా ఈ టీను మీ బిడ్డకి పట్టించండి.

ఇలా రోజుకి మూడుసార్లు చేస్తే సరిపోతుంది.

5.వాము విత్తనాలు

5.వాము విత్తనాలు

వాము కూడా జీలకర్ర లాగానే కడుపునొప్పి తగ్గించటానికి సాయపడుతుంది. దీన్ని చేయగానే మీ బిడ్డకి వెంటనే నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది.

కావాల్సినవి ;

వాము విత్తనాలు - ఒక చెంచా

నీరు - ఒక కప్పు

తయారీ;

ఒక చెంచా వామును ఒక కప్పు నీటిలో వేసి మరిగించండి. చల్లబర్చాక రాత్రంతా అలానే ఉంచి, వడగట్టండి. ప్రతిసారీ ఒక చెంచా ఈ ద్రవాన్ని మీ బిడ్డకి తాగించండి. రోజులో ఇలా చాలాసార్లు చేయండి.

6. జీలకర్ర

6. జీలకర్ర

జీలకర్ర జీర్ణమవటానికే కాదు, కోలిక్ నొప్పి ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

కావాల్సినవి;

జీలకర్ర -1 చెంచా

నీరు - 1కప్పు

తయారీ;

ఒక చెంచా జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి మరిగించండి. చల్లబర్చాక రాత్రంతా నానబెట్టి, వడగట్టండి. ప్రతిసారీ ఒక చెంచా ఈ టీని మీ బిడ్డకి తాగించండి. రోజులో ఇలా చాలాసార్లు చేయండి.

7. పెప్పర్ మెంట్ నూనె

7. పెప్పర్ మెంట్ నూనె

ఈ సుగంధ ద్రవ్య నూనెలో ఉన్న యాంటీస్పాస్మోడిక్ లక్షణాల వలన కోలిక్ కడుపు నొప్పి స్థాయిని తగ్గించటానికి ఇది సాయపడుతుంది.

కావాలసినవి ;

పెప్పర్ మెంట్ సుగంధద్రవ్య నూనె - 2చుక్కలు

బేబీ మసాజ్ నూనె - 1 చెంచా

తయారీ ;

పై రెండిటిని కలిపి మీ బిడ్డ పొట్ట ప్రాంతంలో గుండ్రంగా తిప్పుతూ ఈ మిశ్రమంతో మసాజ్ చేయండి. ఇలా రోజుకి రెండుసార్లు చేయటం వలన మీ బిడ్డకి ఉపశమనం దొరుకుతుంది.

8. ఇంగువ

8. ఇంగువ

ఇంగువ కోలిక్ నొప్పికి ముఖ్యమైన ఇంటిచిట్కాగా భావిస్తారు. ఇది జీర్ణక్రియని బాగుచేసి,గ్యాస్ ను బయటకి తరిమే పద్ధతిలో సాయపడుతుంది.

కావాల్సినవి ;

ఇంగువ

నీరు

తయారీ:

కొంచెం ఇంగువను తీసుకుని నీటితో కలిపి ద్రవంలా చేయండి. దీన్ని మరిగించి చల్లబడనివ్వండి. తర్వాత ఈ ద్రవాన్ని మీ బిడ్డ బొడ్డు చుట్టూతా రాయండి. బొడ్డులో మాత్రం పెట్టవద్దు. రోజుకి ఇలా 2-3 సార్లు చేయండి.

9. ఏలకులు

9. ఏలకులు

జీర్ణవ్యవస్థ అనేక సమస్యలకి ఏలకులను వాడుతూనే ఉంటారు. కడుపు పట్టేయడం, ఉబ్బరం ఏదైనా. అద్భుత విషయం ఏంటంటే అది కోలిక్ నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. హాయిగా అన్పిస్తుంది.

కావాల్సినవి ;

ఏలకుల పొడి - 1 చెంచా

నీరు - 1 కప్పు

తయారీ ; ఒక చెంచా ఏలకుల పొడిని మరిగించిన ఒక కప్పు నీటిలో తీసుకోవాలి. పదినిమిషాలు రసం దిగి బాగా కలిసేదాకా ఆగండి. మిశ్రమం చల్లబర్చండి. తల్లులు దీన్ని రోజుకి కొన్నిసార్లు 1-2 చెంచాల చొప్పున తినటం మంచిది.

10. ద్రాక్ష

10. ద్రాక్ష

ద్రాక్ష వల్ల అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా అజీర్తికి, ఆరోగ్యం మెరుగుపర్చుకోటానికి తింటారు. ద్రాక్షలో ఉండే అనేక ఖనిజలవణాలు, విటమిన్లు జీర్ణశక్తిని, రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

పిల్లలు, చంటిబిడ్డలు ద్రాక్షలను నేరుగా తినలేకపోవచ్చు, అయితే మీరు దాన్ని రసం తీసి మీ బిడ్డకి 1 చెంఛా చొప్పున రోజులో కొన్నిసార్లు తాగించండి.

11. కమలాపళ్ళు

11. కమలాపళ్ళు

అప్పుడే పుట్టిన పాపాయి కోలిక్ నొప్పికి సహజమైన ఇంటిచిట్కా ఆరెంజ్ పళ్ళు. ఏళ్ళ తరబడి దీనిలోని విటమిన్ సి అందరికీ పరిచయమే. ఈ ఒక్క విటమిన్ తోనే కమలాపండు జీర్ణశక్తిని, రోగనిరోధకతను పెంచడంలో ముందుంది.

మీ బిడ్డకి కడుపునొప్పి తొందరగా తగ్గాలంటే, తాజా కమలాపండు రసాన్ని వారికి ఇవ్వండి. దీన్ని ఇతర చిట్కాలతో కలిపి చేయటం వల్ల కూడా మీ బిడ్డకి ఉపశమనం లభిస్తుంది.

12. క్యారట్

12. క్యారట్

క్యారట్ మేటి కూరగాయ అనటంలో ఎలాంటి సందేహం లేదు. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.అనేక ఆరోగ్య పోషకాలతో, క్యారట్ మన జీర్ణవ్యవస్థపై ఎంతో ప్రభావం చూపి, కోలిక్ వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

మీ బిడ్డకి క్యారట్ రసాన్ని తాజాగా ఇవ్వండి.

13. తులసి

13. తులసి

నొప్పి లక్షణాలను తగ్గించే యూజెనాల్ అధికంగా ఉన్న పదార్థం తులసి. ఇది గ్యాస్ ను తొలగించి, కడుపులో అసౌకర్యాన్ని కూడా పోగొడుతుంది.

కావాల్సినవి ;

తులసి ఆకుల పొడి ; 1 చెంచా

వేడి నీరు - 1 కప్పు

తయారీ ;తులసి ఆకుల పొడి ఒక చెంచా తీసుకుని వేడినీరులో కలపండి. కనీసం పదినిముషాలైనా నాననివ్వండి. తర్వాత చల్లబర్చి, మీ బిడ్డకి 1-2 చొప్పున ఇవ్వటం మంచిది.

మరోవిధంగా, తులసి పొడి ఒక చెంచాను నీటితో కలిపి పేస్టులా చేయండి. దీన్ని బొడ్డు చుట్టూరా పూయండి. అది ఎండేవరకూ ఉంచి నీటితో కడిగేయండి.

14. ఉల్లి టీ

14. ఉల్లి టీ

ఇది కూడా ఎంతో ప్రభావవంతమైన ఇంటివైద్య చిట్కా. మీ బిడ్డ కోలిక్ నొప్పిని ఇది కూడా తప్పక వెంటనే తగ్గిస్తుంది.మళ్ళీ రానీయకుండా కూడా చేస్తుంది.

కావాల్సినవి ;

ఉల్లిపాయలు

నీరు

పెప్పర్ మెంట్

తేనె

తయారీ ; కొన్ని ఉల్లిపాయలను తరిగి, నీటిలో వేయండి. అందులో పెప్పర్ మింట్ మరియు తేనెను వేయండి. ఈ మిశ్రమాన్ని మరగనివ్వండి. నీరు చల్లబడ్డాక వడగట్టండి. ఇది 1-2 చెంచాలు మీ బిడ్డకి తాగించండి.

15. వేడి తువ్వాలుతో వత్తడం

15. వేడి తువ్వాలుతో వత్తడం

వేడిగుడ్డతో వత్తడం వలన బేబీకి నొప్పి వెంటనే ఉపశమిస్తుంది.

గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోండి. మెత్తని తువ్వాలును అందులో ముంచి పిండండి. ఆ టవల్ ను బేబీ పొట్టపై ఉంచండి లేక గుండ్రంగా 3-5 నిమిషాలపాటు తిప్పండి. వేడి తగ్గేవరకు తువ్వాలును అలానే ఉంచేయండి.

మంచి ఫలితం కోసం ఇలా రోజుకి రెండుసార్లు చేయండి.

16. గోరువెచ్చని స్నానం

16. గోరువెచ్చని స్నానం

గోరువెచ్చని స్నానం మీ బిడ్డకి కోలిక్ నొప్పి నుంచి త్వరగా శాంతిని పొందేట్లా చేస్తుంది. దీనివల్ల తొందరగా పడుకుంటారు కూడా.

గోరువెచ్చని నీళ్ళతో నిండిన బాత్ టబ్ ను తయారుచేయండి. లావెండర్ నూనె కొన్ని చుక్కలు వేసి బాగా కలపండి. మీ బిడ్డను అందులో పెట్టి మెల్లగా పొట్టను మసాజ్ చేస్తూ, గ్యాస్ పోయేట్లా చూడండి. తర్వాత బయటకు తీసి వళ్ళు తుడవండి.

17. తేపు వచ్చేట్లా చేయండి

17. తేపు వచ్చేట్లా చేయండి

తేన్చడం వలన బేబీ పొట్టలో గ్యాస్ పోయి కోలిక్ నొప్పి తగ్గటం మరియు అజీర్తి కూడా రాకుండా ఉంటాయి.

మీరు బేబీకి పాలు ఇచ్చేసాక, తనని నిటారుగా కూర్చోబెట్టి, వీపును, పొట్టను రుద్దుతూ ఉండండి. చిన్న త్రేన్పు వచ్చేవరకూ అలా రుద్దుతూనే ఉండండి.

ప్రతిసారీ తన భోజనం అయ్యాక ఇలా చేసి కోలిక్ రాకుండా చూసుకోండి.

18. నూనెతో మసాజ్

18. నూనెతో మసాజ్

కోలిక్ పై పోరాటంలో ఈ ఇంటిచిట్కా కూడా బాగా పనిచేస్తుంది. బేబీని వెచ్చగా ఉంచటమేకాదు, జీర్ణశక్తి పెంచి, గ్యాస్ రాకుండా చేస్తుంది.

వేడిచేసిన ఆలివ్ నూనెను కొంచెం తీసుకోంది. మీ చేత్తో బిడ్డ పొట్టపై రాస్తూ, గుండ్రంగా మసాజ్ చేయండి. ఇతరభాగాలైన పక్కటెముకలు, పాదాలు, చేతులకు కూడా ఇలానే రాయండి.

రోజులో ఇలా చాలాసార్లు చేస్తే ఫలితం కన్పిస్తుంది.

19. చంటిపిల్లలకు వ్యాయామం

19. చంటిపిల్లలకు వ్యాయామం

చంటిపిల్లల వ్యాయామం వలన జీర్ణం సులభంగా జరుగుతుంది. కోలిక్ కడుపు నొప్పి కూడా చాలామటుకు ఉపశమిస్తుంది.

బేబీని కిందపడుకోబెట్టండి. మోకాళ్ళ దగ్గర పట్టుకుని కాళ్ళను ,మోకాళ్ళ వద్దకు వచ్చేలా ముడవండి. తర్వాత పొట్ట వైపుకు కాళ్ళను వత్తండి. ఇదే పద్ధతిని 4-6 సార్లు బిడ్డకి వ్యాయామంలా చేస్తుండండి. ఇలా ప్రతిరోజూ చేయాలి.

20. తాజా గాలిలో తిప్పండి

20. తాజా గాలిలో తిప్పండి

కోలిక్ నొప్పి ఉన్న, అప్పుడే పుట్టిన చంటిబిడ్డలు స్వచ్చమైన గాలిలో తిరగడం వల్ల గొప్ప ఉపశమనాన్ని పొందుతారని పరిశోధనల్లో తేలింది. సాయంత్ర సమయాల్లో పిల్లలు బయట ఉండటానికే ఇష్టపడతారు. కొన్ని దేశాల్లో సాయంత్ర భోజనం అవగానే, తల్లులు పిల్లలను ఎత్తుకుని బయట వాకింగ్ చేస్తారు. ఇది బిడ్డను సంతోషపర్చి కోలిక్ రాకుండా చేస్తుంది.

English summary

20 Natural Remedies For Colic In Breastfed Babies

The pain in the Infant's stomach is excruciating and also inevitable. You cannot give the little baby pain killers. What you can do is try some home remedies for colic pain. These home remedies for colic pain are totally natural and safe. Usually, medical doctors prescribe gripe water for babies suffering from colic pain. But it is much better to go with the age old wisdom of our grandmothers. Some of these home remedies for colic pain do not give feed the baby any pain relieving ingredients. Sometimes, even the tactics you use to soothe the crying baby can do the trick. Here are some of the home remedies for colic pain for relieving babies.
Desktop Bottom Promotion