For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లలు పాప్ కార్న్ ని తినగలరా?

పసిపిల్లలు పాప్ కార్న్ ని తినగలరా? ఏ వయసు పిల్లలు పాప్ కార్న్ తినవచ్చు? పాప్ కార్న్ వంటి ఫుడ్స్ పిల్లల గొంతులో అడ్డంపడే ప్రమాదం ఉండటం వలన వారికి శ్వాస తీసుకోవడంలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

|

పసిపిల్లలు పాప్ కార్న్ ని తినగలరా? ఏ వయసు పిల్లలు పాప్ కార్న్ తినవచ్చు? పాప్ కార్న్ వంటి ఫుడ్స్ పిల్లల గొంతులో అడ్డంపడే ప్రమాదం ఉండటం వలన వారికి శ్వాస తీసుకోవడంలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

అందుకే, టాడ్లర్స్ కు పాప్ కార్న్ వంటివి ఇవ్వకూడదు. పిల్లలకు నాలుగేళ్లు నిండే వరకు పాప్ కార్న్ ని ఇవ్వవద్దు.

ముందు జాగ్రత్త చర్యగా పసిపిల్లలకు పాప్ కార్న్ ని అలవాటు చేయకపోవడం మంచిది. కార్న్ పీస్ లు పళ్ళ మధ్యలో ఇరుక్కోవటంతో పాటు గొంతులో అడ్డుపడే అవకాశం ఉంది. అందువలన, వారికి ఊపిరాడటం కష్టమవుతుంది. ఇది వారి ప్రాణానికే ప్రమాదం. ఇక్కడ ఇంకొన్ని వాస్తవాలను పొందుపరచాము.

పాప్ కార్న్ ప్రమాదకరమైన ఆహారపదార్థమా?

పాప్ కార్న్ ప్రమాదకరమైన ఆహారపదార్థమా?

గొంతుకు అడ్డంపడే స్వభావం పాప్ కార్న్ కే ఎందుకుందని మీరనుకోవచ్చు. ఇటువంటి ఫుడ్స్ ని చోకింగ్ ఫుడ్స్ కింద పరిగణిస్తారు. అయితే, ఆశ్చర్యపోయే విధంగా, కేండీ, హాట్ డాగ్స్, చ్యూయింగ్ గమ్స్, నట్స్ తో పాటు గ్రేప్స్ కూడా చోకింగ్ ఫుడ్స్ కోవలోకే వస్తాయి. నిజానికి, పసిపిల్లలకు ఇవన్నీ ప్రమాదకరమైన ఆహారపదార్థాలే.

మరేం చేయాలి?

మరేం చేయాలి?

ఇటువంటి చోకింగ్ ఫుడ్స్ ని పిల్లలకి అందచేయకుండా చూసుకోవాలి. వారికి కనీసం నాలుగేళ్లు వచ్చేవరకు వీటిని దూరంగా ఉంచితే మంచిది. మీ పిల్లలకి ఆహారాన్ని బాగా నమిలి మింగే అలవాటయ్యేవరకు ఇటువంటి ఫుడ్స్ ని వారికి దూరంగా ఉంచాలి.

చోకింగ్ ఎలా సంభవిస్తుంది?

చోకింగ్ ఎలా సంభవిస్తుంది?

గొంతులో ఇరుక్కుని ఉపిరాడకుండా ఇబ్బందిని కల్గించే ఎటువంటి ఫుడ్ నైనా చోకింగ్ ఫుడ్ గా పరిగణించాలి. ఎందుకంటే, చోకింగ్ వలన పిల్లలకు ప్రమాదకరమైన గాయాలు కలగవచ్చు. గణాంకాల ప్రకారం ఒక ఏడాది నుంచి నాలుగేళ్ళ వయసున్న పిల్లలు ఎక్కువగా చోకింగ్ ప్రమాదాల బారిన పడతారని తెలుస్తుంది.

చోకింగ్ ప్రాణాంతకమైనదా?

చోకింగ్ ప్రాణాంతకమైనదా?

అవును, గణాంకాల ప్రకారం కొంతమంది పిల్లలు చోకింగ్ ప్రమాదాల వలన మరణించడం జరిగిందని తెలుస్తోంది. చోకింగ్ ప్రమాదాల వలన సంవత్సరానికి దాదాపు 10000 పిల్లలు హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారని అంచనా. ఈ గణాంకాల బట్టీ చోకింగ్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా వేటిని దూరంగా ఉంచాలి?

ఇంకా వేటిని దూరంగా ఉంచాలి?

బాగా జిగటగా, పొడిగా, గట్టిగా ఉండే ఆహారపదార్థాలను పసిపిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. చిన్న పిల్లల ఫుడ్ పైప్ వైశాల్యం చాలా చిన్నది కాబట్టి మీరు మీ పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాల పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి.

పిల్లలకి ఇవ్వదగిన స్నాక్స్

పిల్లలకి ఇవ్వదగిన స్నాక్స్

పసిపిల్లలకు ఆహారాన్ని అందించే ముందు ఆయా పదార్థాల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వారికివ్వడం మంచిది. ఆపిల్స్, అరటిపళ్ళు, పీచెస్, పియర్స్ తో పాటు నెక్టారైన్స్ ని ఇవ్వచ్చు. అలాగే, చెర్రీస్, ప్లమ్స్ తో పాటు గ్రేప్స్ ని ఇచ్చేముందు వాటిని బాగా గుజ్జులా చేసి ఇస్తే అవి పసిపిల్లల గొంతులో ఇరుక్కుపోవు. అలాగే, పొటాటో, బ్రొకోలీ, పీస్, కేరట్స్ మరియు కాలీఫ్లవర్ ని బాగా మ్యాష్ చేసి పిల్లలకు ఇవ్వడం మంచిది.

English summary

Can Toddlers Eat Popcorn

Are you wondering why? Well, the pieces of the corn can get stuck in the teeth first and some of the fragments may get stuck in the throat and result in choking which is very dangerous at that age. Here are some more facts.
Story first published:Wednesday, December 27, 2017, 15:04 [IST]
Desktop Bottom Promotion