For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పుట్టిన కొంత మంది శిశువులకు ఒత్తైన జుట్టుని కలిగి ఉండటానికి గల కారణాలివే!

|

ఈ ప్రపంచంలోకి విచ్చేస్తున్న బుల్లి అద్భుతాన్ని చూసి ఎత్తుకుని మురిపెంగా ముద్దులాడటం కోసం, ఆ అందమైన కల్మషం లేని కళ్ళలోకి చూస్తూ ఈ జన్మ ధన్యమైందని భావించడం కోసం కాబోయే తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. తమ శిశువు పుట్టగానే చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. తమ శిశువు యొక్క ఆణువణువూ చూసుకుని మురిసిపోతారు. తీయని అద్భుతంగా భావిస్తారు. తమ శిశువు తలపై మృదువైన జుట్టుని చూసి తరిస్తారు.

అప్పుడే పుట్టిన శిశువులు ఈ లోకంలోకి వచ్చిన క్షణం నుంచే తమ ఒంటిపై నూగుతో అలాగే తలపై జుట్టుతో తమ ప్రియమైన వారందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఒత్తైన జుట్టుతో పుట్టిన మీ శిశువు యొక్క అద్భుతమైన ఫోటోలను మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ముందు అసలు మీ శిశువుకి అంత ఒత్తైన జుట్టు ఎలా వచ్చిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి.

Real Reason Why Some Newborns Are Very Hairy

శిశువులలో జుట్టు పెరుగుదల దశలు

ఒంటినిండా నూగుతో శిశువు

నూగు అనేది శిశువుల ముఖంపై, భుజాలపై అలాగే వీపుపై కనిపించే పలుచటి మృదువైన జుట్టు. ఈ నూగు గర్భస్థ శిశువు ఎదుగుదల దశలోనే ఏర్పడుతుంది. అయితే, 36 నుంచి 40 వారాల గర్భధారణ సమయం తరువాత ఈ నూగు మాయమైపోతుంది. ఒకవేళ ఒంటినిండా దట్టమైన నూగుతో మీ శిశువు జన్మించినట్టైతే నాలుగు మాసాల తరువాత ఆ నూగు పడిపోతుంది.

అమ్నియోటిక్ కేవిటీలోనున్న మీ శిశువుని రక్షించే యంత్రాంగంగా ఈ నూగు పనిచేస్తుంది. మీ బొజ్జలోనున్న బుజ్జాయి ఒంటిపై ఉండే వెర్నిక్స్ అనే వెన్నలాంటి పదార్ధం నూగుతోనున్న మీ బుజ్జాయిని గర్భంలో చిక్కుకోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మీ గర్భస్థ శిశువు యొక్క నూగుకి అంటుకుని ఉండటం వలన వెర్నిక్స్ అనేది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తో కొట్టుకుపోకుండా ఉంటుంది.

Real Reason Why Some Newborns Are Very Hairy

నూగు కలిగిన శిశువులు గర్భంలోనున్నప్పుడు కలిగే హార్ట్ బర్న్

ప్రెగ్నన్సీ అనేది సంతోషాన్నిచ్చే సమయం మాత్రమే కాదు కొన్ని చిన్న ఇబ్బందులు కలిగించే సమయం కూడా. ఒక నమ్మకం ప్రకారం, ఈ సమయంలోనే ఎక్కువమంది మహిళలు హార్ట్ బర్న్ సమస్యకు గురవుతారు. యాసిడ్ రిఫ్లక్స్ వలన కలిగే హార్ట్ బర్న్ అనేది తలపై దట్టమైన జుట్టుతో ఎదుగుతున్న మీ శిశువుకు సంకేతంగా వ్యవహరిస్తుంది.

ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు నిర్ధారించబడిన విషయమని మీరు తెలుసుకోవాలి. సైంటిఫిక్ రీసెర్చ్ ల ప్రకారం ఈ అభిప్రాయం వాస్తవమే. చిన్నపాటి నుంచి తీవ్రమైన హార్ట్ బర్న్ కలిగిన కొంతమంది గర్భిణీలపై జరపబడిన దీర్ఘ కాల అధ్యయనాల ప్రకారం ఎక్కువగా యాసిడ్ రిఫ్లక్స్ కి గురైన గర్భిణీలకు పుట్టిన శిశువులు తలపై ఒత్తైన జుట్టు కలిగి ఉంటారని తెలుస్తోంది. కొన్ని సార్లు అల్ట్రా సౌండ్ కూడా మీ శిశువు యొక్క జుట్టుని గుర్తిస్తుంది.

Real Reason Why Some Newborns Are Very Hairy

కొంతమంది గర్భిణీలలో బ్లోటింగ్ తో పాటు చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఫుడ్ పైప్ నుంచి యాసిడ్ ను పంప్ చేసే లోయర్ ఎసోఫగేల్ స్పింక్చార్ అధికంగా సడలింపుకి గురవడం వలన గర్భిణీలు హార్ట్ బర్న్ సమస్యతో ఇబ్బందికి గురవుతారు. అయితే, ఈస్ట్రోజెన్ అనేది మీ శిశువు తలపై ఒత్తైన జుట్టుని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి.

ప్రెగ్నన్సీలో కలిగే హార్ట్ బర్న్ ని నివారించేందుకు హోమ్ రెమెడీస్

మీ శిశువు తలపైన జుట్టు ఒత్తుగా ఉంటుందా లేదా అనే విషయంపై మీకు నియంత్రణ లేకపోయినా హార్ట్ బర్న్ నుంచి మీరు ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.

రోజంతా స్మాల్ మీల్స్ ని ప్రిఫర్ చేయండి.

వంగటం, భోజనం చేసిన వెంటనే ఒక్కసారిగా కదలటం, బోర్లా పడుకోవడం వంటిని నివారించండి.

చేదు, పులుపు, ఉప్పు, కారం వంటివి మితంగా తీసుకోండి.

బాదాం, అవొకాడో, ఆకు కూరలు, హెర్బల్ టీ, వెల్లుల్లి, పెరుగు మరియు స్మూతీల వంటి ఆల్కలైజింగ్ ఫుడ్స్ ని తీసుకోండి.

Real Reason Why Some Newborns Are Very Hairy

గర్భస్థ శిశువులలో జుట్టు పెరుగుదలకు అలాగే గర్భిణీలలో హార్ట్ బర్న్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి వివిధ రీసెర్చ్ లు ఎన్నో సాక్ష్యాలను వెల్లడించినా ఇంకా సరైన స్పష్టత లేదు. దీనిపై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, హార్ట్ బర్న్ సమస్య లేని గర్భిణీలు ఒత్తైన జుట్టు కలిగిన పండంటి శిశువులకు జన్మనివ్వడం, మరోవైపు హార్ట్ బర్న్ సమస్యతో సతమతమైన గర్భిణీలు బట్టతల కలిగిన శిశువులకు జన్మనివ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం.

ప్రెగ్నన్సీ సమయంలో ఏవైనా జరుగవచ్చు. ఈ సమయంలో సంభవించే మార్పులలో కొన్ని పర్యావరణం, హార్మోన్లు, జన్యుశాస్త్రంపై ఆధారపడి ఉంటాయి మరికొన్ని మిగతా ఫ్యాక్టర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఆశాజనకంగా ఉండటమే. ఒత్తైన జుట్టుతో పుట్టినా లేదా పలుచటి జుట్టుతో పుట్టినా మీరు మీ బుల్లి అద్భుతాన్ని చేతుల్లోకి తీసుకుని మురిపెంగా ఆరాధించండి.

English summary

Real Reason Why Some Newborns Are Very Hairy

From counting the teeny tiny toes and fingers to just gazing into those innocent eyes, any new parent will be left awestruck at the sight of the newborn. Every part of your little wonder’s body seems like a sweet discovery and that includes those fine strands of silky hair on his head.
Story first published: Wednesday, December 6, 2017, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more